LIVE : సిద్దిపేటలో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ రోడ్​ షో - ప్రత్యక్షప్రసారం - KCR Election Campaign Live

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 6:55 PM IST

Updated : May 10, 2024, 9:42 PM IST

thumbnail

BRS Chief KCR Election Campaign In Siricilla Live : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్​ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ సిరిసిల్ల వచ్చిన సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ అధికార కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ​ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వరాదని కోరుతున్నారు. 

Last Updated : May 10, 2024, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.