LIVE : హైదరాబాద్‌లో బీజేపీ మేనిఫెస్టో తెలుగు వెర్షన్ విడుదల కార్యక్రమం - BJP MANIFESTO TELUGU VERSION LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 1:38 PM IST

Updated : Apr 21, 2024, 2:09 PM IST

thumbnail

BJP Manifesto Live : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. సంకల్ప పత్రం పేరుతో  మేనిఫెస్టోను ప్రకటించింది. మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్పపత్ర రూపకల్పన చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందుకోసం 4లక్షల మంది పంపిన 15 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించి కీలకాంశాలను పొందుపరిచింది.మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్‌, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Last Updated : Apr 21, 2024, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.