LIVE : వంగరలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 12:31 PM IST

thumbnail

Bandi Sanjay in Husnabad Prajahita Yatra Live : హనుమకొండ జిల్లాలోని వంగర గ్రామంలో బండి సంజయ్​ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చిగురుమామిడిలో పర్యటించిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్​ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్​ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు తీవ్రంగా ఖండించగా, తాజాగా బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. ఏదో అలజడి సృష్టించి, యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నిలబెట్టాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే పొన్నం సన్యాసం తీసుకుంటారా అని సవాల్​ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.