ఆక్వా ఉత్పత్తులకు ఏపీలోనే ఎక్కువ ధరలు: సాధికారిక కమిటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 7:12 PM IST

thumbnail

Aqua Empowerment Committee on Prices: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఆక్వా ఉత్పత్తులకు అత్యధిక ధర చెల్లిస్తున్నట్టు ఆక్వా సాధికారిక కమిటీ (Aqua Empowerment Committee) స్పష్టం చేసింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy), బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana), సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju), అధికారులతో కూడిన ఆక్వా సాధికారిక కమిటీ ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం ఏపీలో వంద కౌంట్ రొయ్యలకు కిలో 245 రూపాయలు ధర నిర్ధారించినట్టు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌ (International Market)లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ రైతులు (Aqua Farmers) నష్టపోకుండా చర్యలు చేపట్టాల్సిందిగా సాధికారిక కమిటీ అధికారులను ఆదేశించింది. 

రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణ కోసం కృషి చేయాల్సిందిగా కమిటీ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ-ఫిష్ సర్వే (E-FISH Survey) ద్వారా అక్వా సాగు అవుతున్న ప్రాంతాలను గుర్తించామని అధికారులు తెలిపారు. 10 ఎకరాల లోపు 3.57 లక్షల ఎకరాల్లోనూ, అంతకు మించి 1.10 లక్షల ఎకరాల్లోనూ ఆక్వా సాగు అవుతున్నట్లు తేలిందని వెల్లడించారు. అర్హులైన అక్వా రైతులకు సబ్సిడీ (Subsidy for Aqua Farmers)పై విద్యుత్ సరఫరా (Power Supply) చేస్తున్నట్టు సాధికారిక కమిటీ తెలిపింది. రాష్ట్రంలో 43 వేల 548 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు, సబ్సిడీ కింద 513 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 1962 ఆక్వా హబ్‌ల ద్వారా 657 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు విక్రయించినట్టు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.