ఏపీఎన్జీవో నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం - నూతన అధ్యక్షుడుగా కేవీ శివారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 10:16 PM IST

Updated : Feb 29, 2024, 10:30 PM IST

thumbnail

AP NGO New Working Group : ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ (APNGO Bandi Srinivas) గురువారం రిటైర్ అయ్యారు. దీంతో నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఏపీఎన్జీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏపీఎన్జీవో భవన్​లో ఎన్నికల నిర్వహించామని మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ తెలిపారు. తాను రిటైర్ అవడంతో నూతన అధ్యక్షుడుగా కేవీ శివారెడ్డి (KV Siva Reddy) ఎన్నికయ్యారని అన్నారు. జనరల్ సెక్రటరీగా చౌదరి పురుషోత్తం నాయుడు, ఉపాధ్యక్షుడుగా బండారు వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడుగా దస్తగిరి రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. 12వ పీఆర్సీ ఇప్పించే బాధ్యత నూతన కార్యవర్గానిదే ఆయన స్పష్టం చేశారు.

AP NGO New President KV Siva Reddy : ఏపీఎన్జీవో సంఘం నూతన అధ్యక్షుడు కేవీ శివారెడ్డి మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఓపీఎస్​గా మార్చాల్సిన వారికి మార్పించాల్సిన బాధ్యత తమదేనని అన్నారు. ఉద్యోగుల పక్షాన తాము పోరాడతాని స్పష్టం చేశారు. ఆర్ధిక అంశాలపైన సీఎస్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (Quantum of Pension) సాధిస్తామని ఆయన వెల్లడించారు.

Last Updated : Feb 29, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.