ఆంక్షలు, నిర్బంధాలు ఏవీ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి : అమరావతి రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 7:56 AM IST

thumbnail

Amaravati farmers protest with candles : అమరావతి ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు పూరైన సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 1500 అంకెల రూపంలో నిల్చొని అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద మానవహారాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్​ తన మొండి వైఖరి విడాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Amaravati Movement Reached 1500 Days : మూడు రాజధానుల ప్రకటనపై నిరసన, ఆందోళనతో మొదలైన అమరావతి ఉద్యమం అనేక అడ్డంకులు అధిగమించి 1500 రోజులకు చేరిన విషయం అందరికి తెలిసిందే. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు ఎన్నో అడ్డంకులు ఇవేవీ అమరావతి రైతుల, మహిళల ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేదని పేర్కొన్నారు. అధికార నాయకుల మొండి వైఖరి ముందు తమ సంకల్పం గొప్పదని చెప్పుకొచ్చారు. పాలకులు, అధికారులు అమరావతి రైతులు, మహిళలను ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తమని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.