కడప ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు - పరిమితిని మించిన ఆస్తులే కారణమా! - ACB RAIDS ON MRO HOUSE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 2:06 PM IST

Updated : Mar 30, 2024, 2:50 PM IST

thumbnail

ACB Officers Raids on MRO House in Tirupati District : వైఎస్సార్​ జిల్లాలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న శివప్రసాద్​ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. పరిమితికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు రావడంతో విజయవాడ ఏసీబీ బృందం శనివారం సోదాలు నిర్వహించారు. రేణిగుంట, తిరుపతి, బెంగళూరు, కడప నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

గతంలో రేణిగుంట ఎమ్మార్వో గా పని చేస్తూ ఎన్నికల కోడ్​ నేపథ్యంలో ఫిబ్రవరి 5న కడపకు బదిలీ అయ్యారు. రేణిగుంట ఎమ్మార్వోగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం, అసైన్‍ మెంట్‍, డీకేటీ భూములకు నిరభ్యంతర (NOC - NO Objection Certificate) పత్రాలు ఇవ్వడం వంటి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కడప ద్వారకా నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంటిని సోదా చేయగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.59 లక్షలు నగదును డ్రా చేసినట్లు అధికారులు వెల్లడించారు. అందులో కొంత నగదును ఖర్చు చేసి మిగిలిన రూ.36 లక్షలను తన నివాసంలో భద్ర పరిచినట్లు సమాచారం. ఈ నగదు సంబంధించిన ఎలాంటి పత్రాలు ఆయన వద్ద దొరకలేదని అధికారులు పేర్కొన్నారు. ఏసీబీ సోదాలు సాయంత్రం వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Last Updated : Mar 30, 2024, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.