ETV Bharat / state

ప్రభుత్వం కన్నా ఎక్కువ సాయం చేశాం - దుష్ప్రచారం తగదు: టీడీపీ ఎన్నారైలు - YCP Spread Rumours on TDP NRIS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 12:03 PM IST

YCP Leaders Spreading Misinformation Against TDP NRIs
YCP Leaders Spreading Misinformation Against TDP NRIs

YCP Leaders Spreading Misinformation Against TDP NRIs: వైసీపీ ప్రభుత్వం చేసిన సాయం కన్నా ఎన్నారైలుగా తాము ఐదు రెట్లు చేశామని టీడీపీ ఎన్నారై నేతలు అన్నారు. సాక్షి పత్రికలో మాపై తప్పుగా రాసి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అధికార పార్టీ నాయకుల దిగజారుడుతనానికి వాళ్లు రాసే రాతలే నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP Leaders Spreading Misinformation Against TDP NRIs : సీఎంఆర్‌ఎఫ్‌ (Chief Minister Relief Fund) ద్వారా వైసీపీ ప్రభుత్వం చేసిన సాయం కంటే ఎన్నారైలుగా (Non-Resident Indian) తాము ఐదు రెట్లు ఎక్కువ చేశామని తెలుగుదేశం పార్టీ ఎన్నారై నేతలు తెలిపారు. దేశ ప్రగతికి తమ వంతుగా కృషి చేస్తున్న ఎన్నారైల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాక్షి పత్రిక సహా సామాజిక మాధ్యమాల్లో వైఎస్సారీపీ నేతలు దుష్ప్రచారం చేయడం దారుణమని వారు వాపోయారు. గుంటనక్కల్లా గ్రామాల్లోకి వచ్చారు అంటూ సాక్షి పత్రికలో ప్రచురించిన కథనాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నాయకుల దిగజారుడుతనానికి ఈ రాతలు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ దుష్ప్రచారంతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది: టీడీపీ ఎన్నారైలు

రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావటం అవసరం: ఎన్నారై టీడీపీ - NRI TDP Leaders on ap elections

NRIs are Against YCP Leaders: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై టీడీపీ నేతలు సాయి, సతీష్‌, నాగమల్లేశ్వరరావు తదితరులు వాపోయారు. అబద్ధం ప్లస్‌ బుదర ఇక్వెల్‌ టు వైసీపీ అని అన్నారు. కొవిడ్‌ సహా అనేక విపత్తుల్లో ఎన్నారైలుగా మా వంతు సేవ చేశామని వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, యూరప్‌ సహా వివిధ దేశాల్లో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా అండగా నిలిచామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అనేక దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎన్నారై నేత సాయి డిమాండ్‌ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో చూశామన్నారు. ఎన్నారైలపై అనుచిత వ్యాఖ్యల్ని పార్టీల కతీతంగా అందరూ ఖండించాలని సతీష్‌ కోరారు.

NRI పెళ్లిళ్లకు కొత్త చట్టం! మోసం చేస్తే ఇక అంతే!

రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావటం అవసరమని ఎన్నారైలు అన్నారు. విజన్ ఉన్న లీడర్ చంద్రబాబును గెలిపించటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఎంను చేయటమే తమ లక్ష్యమన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కృషితో తాము ఐటీ రంగంలో స్థిరపడి లక్షల రూపాయల వేతనాలు పొందుతున్నామని అన్నారు. దీంతోపాటు ఎంతోమందికి వారు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మహిళాభివృద్ధి జరగాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు

బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు : పెమ్మసాని చంద్రశేఖర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.