ETV Bharat / bharat

NRI పెళ్లిళ్లకు కొత్త చట్టం! మోసం చేస్తే ఇక అంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 3:25 PM IST

Updated : Feb 16, 2024, 3:52 PM IST

Law Commission On NRI Marriages : ఎన్ఆర్ఐలతో భారతీయుల వివాహాలకు సంబంధించి అనేక మోసాలు వెలుగుచూస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది లా కమిషన్. దీనిపై కేంద్రం చట్టాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. చట్టంలో ఉండాల్సిన నిబంధనల గురించి సిఫార్సుల్లో పేర్కొంది.

Law Commission On NRI Marriages
Law Commission On NRI Marriages

Law Commission On NRI Marriages : ఎన్ఆర్ఐలకు, భారత పౌరులకు మధ్య జరిగే వివాహాల్లో అనేక మోసపూరిత ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని లా కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవలి కాలంలో ఎన్ఆర్ఐల మోసపూరిత వివాహాల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఎన్ఆర్ఐలతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) పరిధిలోకి వచ్చే వారికి భారత పౌరులతో జరిగే వివాహాలను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది.

"భారత పౌరులైన వ్యక్తులతో ఎన్ఆర్ఐలకు జరిగిన వివాహాల్లో అనేక మోసాలు వెలుగు చూస్తున్నాయి. చాలా కేసుల్లో ఈ పెళ్లిళ్లు మోసపూరితమైనవని నివేదికలు చెబుతున్నాయి. భారత్​కు చెందిన తమ భార్యలను కొందరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వదిలేయడం ఆందోళన కలిగిస్తోంది."
-విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, లా కమిషన్ ఛైర్మన్

ఈ చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల కస్టడీ, వారి మెయింటెనెన్స్​కు సంబంధించిన నిబంధనలు ఉండాలని లా కమిషన్ పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు/ వారెంట్లు జారీ చేయడం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు సైతం ఉండాలని స్పష్టం చేసింది. ఎన్ఆర్ఐ/ఓసీఐలకు భారత పౌరులకు జరిగే వివాహాల రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఇండియాలోనూ నమోదు చేయించాలని సిఫార్సు చేసింది.

పాస్​పోర్ట్​పై మ్యారెజ్ నంబర్
మరోవైపు, 1967 పాస్​పోర్ట్ చట్టానికి సవరణలు చేయాలని లా కమిషన్ సూచించింది. వైవాహిక స్థితి (మారిటల్ స్టేటస్)ని బహిర్గతం చేయడం సహా జీవిత భాగస్వాముల రెండు పాస్​పోర్ట్​లను లింక్ చేసేలా నిబంధనలు తీసుకురావాలని పేర్కొంది. భాగస్వాముల ఇద్దరి పాస్​పోర్ట్​లపై వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది.

కాగా, ఈ సమస్య పరిష్కారానికి '2019-రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ' బిల్లును కేంద్రం 2019 ఫిబ్రవరి 11న రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయాన్ని లా కమిషన్ గుర్తు చేసింది. కాగా, ఈ బిల్లును విదేశాంగ శాఖ పార్లమెంటరీ కమిటీకి 16వ లోక్​సభ పంపించింది. ఆ తర్వాత 17వ లోక్​సభ ఏర్పాటు కాగా- మళ్లీ ఈ బిల్లును విదేశాంగ శాఖ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. దీనిపై అటు చర్చలు కొనసాగుతుండగానే- బిల్లుపై సిఫార్సులు ఇవ్వాలని లా కమిషన్​ను విదేశాంగ శాఖ కోరింది.

పెళ్లి చేసుకుంటున్నారా? వెడ్డింగ్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - ఎందుకంటే?

ఆరు నెలల్లో 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి!

Last Updated : Feb 16, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.