ETV Bharat / state

ఇష్టారాజ్యంగా చెక్ డ్యామ్​ల నిర్మాణం - వరద నీరుతో మునిగిపోతున్న పంట పొలాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 7:32 PM IST

Unnecessary Check Dam Construction in Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో అధికారులు ఇష్టారాజ్యంగా చెక్ డ్యామ్​లను నిర్మించారు. రైతులకు సాగుకు ఉపయోగపడాల్సినటువంటి చెక్ డ్యాములు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాగు భూమి అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడాల్సిన చెక్ డ్యాములు రైతుల పంటలను ముంచుతున్నాయి.

Check Dam Construction in Khammam
Unnecessary Check Dam Construction in Khammam

Unnecessary Check Dam Construction in Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగులో ఇరిగేషన్ అధికారులు మూడు చెక్ డ్యాములను నిర్మించారు. వాగులో అవసరం లేకపోయినా వాటిని నిర్మించేసరికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం డి జనరేషన్ ఆఫ్ వాటర్ స్కీమ్ కింద 2020లో చెక్ డ్యామ్​ల నిర్మాణం చేపట్టారు. నీటి ప్రవాహం ఉన్న వాగుల్లో చెక్ డ్యామ్​లో నిర్మించి తద్వారా నీటి లెవెల్ పెంచెందుకు రైతులకు సాగునీరు ఉపయోగపడేందుకు వీటిని కట్టడం చేపట్టారని అధికారులు తెలిపారు.

Check dam shutters destroy : చెక్​ డ్యాం షట్లర్​లు​ ధ్వంసం చేశారు.. ఎందుకంటే..?

అయితే 15మీటర్ల వెడల్పు ఉన్న వాగుకు 70మీటర్ల చెక్ డ్యాములను నిర్మించారు. ఒక్కొక్క డ్యామ్ సూమారు రూ.2.50 కోట్లతో నిర్మించారు. కాగా కోడిపుంజుల వాగులో సుమారు 45 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు నిర్మిస్తే సరిపోయేది. కానీ ఎక్కువ వెడల్పుతో డ్యామ్ నిర్మించడం వల్ల సమీపంలో ఉన్న పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ప్రాజెక్టు సరైన రీతిలో నిర్మించకపోవడం వల్ల వర్షాకాలంలో పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

"కోడిపుంజుల వాగు దగ్గర మూడు చెక్ డ్యాములు నిర్మించారు. వర్షాకాలంలో వరద నీరు వల్ల కోతకు గురవుతుంది. గైడ్​వాల్స్ కడతామన్నారు కానీ కట్టడం లేదు. కమలాపురంలో నిర్మించాల్సిన డ్యామ్​లు ఇక్కడ నిర్మించారు. అక్కడ అనవసరంగా డ్యామ్ ఇక్కడ నిర్మించారు. దీనిపై చాలాచోట్ల ఫిర్యాదు చేసినా అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కనీసం పంట నష్టం వచ్చినప్పుడు పరిహారం కూడా చెల్లించలేదు. గైడ్​వాల్స్ కట్టాలని గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దానివల్ల పంటను నష్టపోతున్నాం." - బాధిత రైతులు

Unnecessary Check Dam Construction in Khammam ఇష్టారాజ్యంగా చెక్ డ్యామ్​ల నిర్మాణం వరద నీరుతో మునిగిపోతున్న పంట పొలాలు

Check Dam Fail: కోట్ల రూపాయల వృథా.. డిజైన్ లోపంతో నిరూపయోగంగా చెక్‌డ్యామ్‌

Check Dam Construction in Khammam : ఒకచోట నిర్మించాల్సినటువంటి డ్యామ్​లను అధికారులు మరోచోట నిర్మించారు. గతంలో కట్టు మల్లారం ప్రాంతంలో రూ.30లక్షలతో చెక్​ డ్యామ్ నిర్మించారు. కానీ వాటి వల్ల పంట పొలాలు దెబ్బతినకుండా గైడ్​వాల్స్ నిర్మించాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, కనీసం కాంగ్రెస్ అధికారులు ముందుకు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. వర్షకారంలో పంటలు దెబ్బతినకుండా ప్రస్తుత తరుణంలో పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Check Dam Construction: అనువుగాని చోట చెక్‌డ్యాములు.. నిపుణుల పరిశీలనలో తేలిన లోపాలు!

తెగిపోయిన చెక్​డ్యాం.. ఆందోళనలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.