ETV Bharat / state

కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 9:42 PM IST

TTD Terminates Ramana Dikshitulu From Post of Chief Priest: శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. టీటీడీ అధికారులపై రమణ దీక్షితులు ఎక్స్‌లో పలు ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూమన పేర్కొన్నారు.

ttd_terminates_ramana
ttd_terminates_ramana

కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధానార్చకుల పదవి నుంచి రమణ దీక్షితులు తొలగింపు

TTD Terminates Ramana Dikshitulu From Post of Chief Priest: వై​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ పాలక మండలి తీసుకొంటున్న నిర్ణయాలు భక్తులకు శ్రీవారిని దూరం చేసే విధంగా ఉంటున్నాయి. వైసీపీ నాయకుల తీరు వరుస వివాదాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఉంటున్నాయి. ఇటీవల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Dikshitulu) ఆలయ వ్యవహారాలపై, టీటీడీ ఈఓపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి తోడు ఉద్యోగులు, అర్చకులు మీడియా సమావేశాలు నిర్వహించి రమణ దీక్షితులపై ప్రతి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు భిన్నంగా అదే వివాదాలకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పులు సరిదిద్దుకోకుండా రమణ దీక్షితులుపై వేటు దారుణం: నారా లోకేశ్

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam), ముఖ్యమంత్రి జగన్, ఈవో ధర్మారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలను, ఆరోపణలను ఉపేక్షించేది లేదని, ఈ మేరకు రమణ దీక్షితులను ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా తొలగించాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) తెలిపారు. ఇవాళ స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మండలి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు భూమన వివరించారు.

తిరుమలలో ట్రాక్టర్​ బీభత్సం - ఇద్దరు భక్తులకు గాయాలు

టీటీడీలోని కాంట్రాక్ట్, సొసైటీ తరుపున పని చేస్తున్న తొమ్మిది వేల మందికి జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గాలిగోపురం, ఆంజనేయస్వామి, మోకాలి మెట్టు వద్ద నిత్యాసంకీర్తనార్చన గానం నిర్వహించాలని ఆమోదించామన్నారు. శ్రీవారి ఆలయంలో నిజయవిజయులు ద్వారానికి బంగారు తాపడానికి రూ. 1.69 కోట్లు మంజూరు చేశామన్నారు. నాలుగు కోట్లతో మంగళసూత్రాలు తయారీకి నాలుగు ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్ ఆహ్వానించామన్నారు. పాదిరేడులోని టీటీడీ ఉద్యోగస్తుల ఇంటిస్థలాల లే అవుట్ అభివృద్ధికి రూ. 8.16 కోట్లు తూడాకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీనివాస దివ్యానుగ్రమ హోమం నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణం కోసం రూ. 4.12 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలకు మరో మూడేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఆమెదించామన్నారు.

అరాచకాల్లో ఆరితేరిన తండ్రీ కొడుకులు - తిరుపతిలో అంతా ఆ నాయకుడి 'కరుణ'

రమణ దీక్షితుల విమర్శలపై టీటీడీ స్పందించిన తీరు ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్షనేతలు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుల తరహాలో అర్చకులు మీడియా ముందుకు వచ్చి విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండా టీటీడీ ఉద్యోగ సంఘాలు, ఆలయ అర్చకులు ఒకరినొకరు విమర్శలు చేసేలా ప్రోత్సహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలతో వివాదం ముదిరి ఆలయ గౌరవాన్ని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండగా మరో వైపు అర్చకులు రమణదీక్షితులపై పోలీసు కేసులు పెట్టడం వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోందని మండిపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.