తిరుమలలో ట్రాక్టర్​ బీభత్సం - ఇద్దరు భక్తులకు గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 1:16 PM IST

thumbnail

Tractor Hit the Gate of Tirumala SV Complex : తిరుమల ఎస్వీ కాంప్లెక్స్​ వద్ద ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. బ్రేకు వేయబోయి డ్రైవర్​ పొరపాటున యాక్సిలెటర్​ను తొక్కాడు. ఇంకా ఏముంది ఆ ట్రాక్టర్​ ఎస్వీ కాంప్లెక్స్​ గేటును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్విమ్స్ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అందరు చూస్తూ ఉండగానే ట్రాక్టర్​ వేగంగా వచ్చి గేటును ఢీ కొట్టిందని స్థానికులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల సమయంలో భక్తుల రద్దీ తక్కువ ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు పేర్కొన్నారు.స్థానికుల సమాచారంతో ట్రాఫిక్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్​ను సీజ్​ చేసి, డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవరును అడిగి తెలుసుకున్నారు. నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమకు కావలసిన సామగ్రిని ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తుంటారని స్థానికులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.