తప్పులు సరిదిద్దుకోకుండా రమణ దీక్షితులుపై వేటు దారుణం: నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 5:50 PM IST

thumbnail

TDP Lokesh on TTD Ramana Deekshitulu Issue: నియంత పాలనలో నోరు విప్పడం కూడా నేరమే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP National General Secretary Nara Lokesh) ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు(YSRCP Leaders) చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(TTD Suspends Ramana Deekshitulu)పై వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుంచి భక్తులకు తెలిసేలా చేశారన్నారు.

చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి రమణ దీక్షితులుపై కేసు పెట్టడం, అరెస్ట్ చెయ్యాలని చూడటం జగన్(CM Jagan) అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. దేవుడి జోలికి వెళ్లిన వారు ఎవ్వరూ బాగు పడినట్టు చరిత్రలో లేదన్న లోకేశ్​, దైవంతో ఆటలొద్దు జగన్ అంటూ హెచ్చరించారు. కాగా రమణ దీక్షితులను ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD), ముఖ్యమంత్రి జగన్, ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy)లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై వేటు వేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.