ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు గుర్తించాం - విజిలెన్స్‌ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు'

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 8:57 AM IST

Vigilance Commission Investigation on Kaleshwaram
TS Govt Report to High Court on Kaleshwaram Project

TS Govt Report to High Court on Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలను గుర్తించామని, దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విజిలెన్స్ కమిషన్ విచారణతో పాటు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ ఏర్పాటు చేశామని, అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. తుది నివేదిక వచ్చాక తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసింది.

TS Govt Report to High Court on Kaleshwaram Project : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ నిర్వహించింది. దీనికి నెంబరు కేటాయించడానికి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe), జస్టిస్ జే అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాళేశ్వరంపై ఇలాంటి పిటిషన్లు ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించింది.

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తాం : ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

2016వ సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే, ఇప్పటివరకు ఏం చేస్తున్నారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమాలు జరిగాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా, ఇదేం ప్రచార ప్రయోజన వ్యాజ్యం కాదని, తాము ప్రశ్నలు అడగటం మొదలుపెడితే సమాధానాలు సైతం చెప్పలేరని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టుపై ఇప్పటికే విచారణ చేపట్టామన్నారు.

NDSA Committee Investigation on Medigadda Project : గత ఏడాది అక్టోబరు 24, 25 తేదీల్లో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక దర్యాప్తు చేపట్టిందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోవడానికి కారణాలను గత ఏడాది నవంబరు 1న రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించిందన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ ఆధారిటీ ఇచ్చిన సమాచారం మేరకు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ నాణ్యత ఆపరేషన్ నిర్వహణలో సమస్యలున్నాయని బ్యారేజ్ ర్యాఫ్ట్ కుంగిపోయి పియర్స్‌లో కదలిక ఏర్పడి పగుళ్లు బారాయని తెలిపారు. ఇంకా పలు లోపాలు ఉన్నట్లు తేలిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొందన్నారు.

రాష్ట్రప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని, సదరు అధికారులు ప్రాథమిక నివేదికను(Preliminary Report) ప్రభుత్వానికి సమర్పించారన్నారు. దీని ఆధారంగా రామగుండం ఇంజినీరింగ్​ ఇన్​ చీఫ్​​ను తొలగించిందన్నారు. ఇరిగేషన్ ఈఎన్​సీ రాజీనామా చేయాలని ఆదేశించిందన్నారు. విజిలెల్స్ తుది నివేదిక అందిన తరువాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Vigilance Commission Inspection on Kaleshwaram : మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌లో లోపాలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిబ్రవరి 13న ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మార్చి 1న ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మేడిగడ్డ పియర్స్ కుంగబాటుకు(Medigadda Pears) దారితీసిన కారణాలను పరిశీలించడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల్లో సమస్యలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని కమిటీకి ఆదేశించిందన్నారు.

కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద ప్రభుత్వానికి ఉన్న అధికారంతో సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని యోచిస్తున్నట్లు తెలిసారు. ఏజీ సమర్పించిన రాతపూర్వక వివరణను పరిగణనలోకి తీసుకున్న సీజే ధర్మాసనం, ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టినందున తదుపరి విచారణని 4 నెలల తరువాత చేపడతామంటూ వాయిదా వేసింది.

కాళేశ్వరంపై విచారణకు 4నెలలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ

మేడిగడ్డపై మరింత లోతుగా విజిలెన్స్ విచారణ - మెజర్​మెంట్​ బుక్​ నిర్వాకంపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.