ETV Bharat / state

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TS

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 8:52 AM IST

Updated : May 13, 2024, 5:22 PM IST

Tollywood Celebrities Caste Their Votes : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ తమ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహా తదితరులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు

Telugu Celebrities Case Their Votes
Cine Celebrities Casting Their Votes In Telangana (ETV Bharat)

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే (ETV BHARAT)

Film Celebrities Casting Their Votes In Telangana : హైదరాబాద్‌లో పలువురు సినీ నటులు తమ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్​లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్‌ ఫిల్మ్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయాలని వారు సూచించారు.

Telugu Celebrities Case Their Votes
Cine Celebrities Casting Their Votes In Telangana (ETV Bharat)

కొడంగల్​లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote

ఓటు వేసిన మెగాస్టార్​- ఇతర ప్రముఖులు : జూబ్లీహిల్స్​లో సీనియర్​ నటుడు చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత కూడా ఓటేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదని అది మన బాధ్యత అని తెలిపారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటు వేయాలని కోరారు. సికింద్రాబాద్ పద్మారావునగర్​ వాకర్స్​ టౌన్​హాల్​లో ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల తన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన శేఖర్​ కమ్ముల ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నానక్రమ్​గూడలో హీరో నరేష్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్​లో సినీ దర్శకులు రాఘవేంద్రరావు, సినీ హీరో మనోజ్, యాంకర్ ఝాన్సీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tollywood Celebrities Caste Their Votes
ఓటు వేసేందుకు వచ్చిన హీరో నాని (ETV Bharat)

Mahesh Babu His wife Namrata Cast Their votes : జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో మహేశ్‌బాబు దంపతులు ఓటు వేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ క్లబ్‌ పోలింగ్‌ కేంద్రంలో రామ్‌చరణ్, ఉపాసనలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, నటుడు నాగచైతన్య, మంచు లక్ష్మీ, శేఖర్‌ కమ్ముల, శివబాలజీ దంపతులు, నటుడు నాని, సుమంత్‌, ఆనంద్‌ దేవరకొండ తదితరులు హైదరాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యస్ఫూర్తిని చాటారు.

Tollywood Celebrities Caste Their Votes
ఓటు వేసేందుకు వెళ్తున్న హీరో మహేశ్ ​బాబు (ETV Bharat)

Ram Charan Casts Vote In Jubilee Hills Club : "ఓటర్లందరూ బయటకు వచ్చి ఓటేయాలని హీరో రామ్​చరణ్​ పిలుపునిచ్చారు. ఓటు బరువు కాదని మన బాధ్యతగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇళ్లల్లో ఉన్న యువత బయటకు వచ్చి ఓటేయాలని తెలిపారు.

ఓటుహక్కును వినియోగించుకున్న ప్రముఖ హీరో బాలకృష్ణ : మరోవైపు ఏపీలో హిందూపురంలో ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ దంపతులు తమ ఓటు వేశారు. నటుడు పవన్​ కళ్యాణ్ మంగళగిరిలో​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్​ శంకర్​ ఓటు ఆవశ్యకతపై సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్న నాయకులను గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మంచు ఫ్యామిలీ హీరోలు మోహన్ బాబు, విష్ణు, మనోజ్​ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు నాగచైతన్య తన ఓటు వేశారు. ప్రముఖ దర్శకులు ఎస్ఎస్​ రాజమౌళి దంపతులు, దర్శకుడు తేజా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరో వివాదంలో మాధవీలత - హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు - CASE ON MP CANDIDATE MADHAVI LATHA

సీఎం రేవంత్​ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలి - ఈసీకి రఘునందన్‌ రావు ఫిర్యాదు - lok sabha elections 2024

Last Updated : May 13, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.