ETV Bharat / state

సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: టీడీపీ - Subbarao Family Suicide Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 7:38 PM IST

Subbarao family suicide
Subbarao family suicide

TDP demands a comprehensive inquiry into Subbarao family suicide: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొత్తమాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. టీడీపీ అధికారంలో వచ్చాక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ప్రకటించారు.

సుబ్బారావు కుటుంబానికి టీడీపీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థికసాయం

TDP demands a comprehensive inquiry into Subbarao family suicide: వైసీపీ నేతల భూదాహానికి వైఎస్ఆర్ కడప జిల్లాలో చేనేత కుటుంబం బలైపోయిందని విపక్ష నేతలు ఆరోపించారు. మాధవరంలో చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం సొంత జిల్లాలో వేలాది ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు.

ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పిన నారా లోకేశ్: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొత్తమాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ప్రకటించారు.

ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ దాష్టీకానికి చేనేత కుటుంబం బలి కావడం, పెత్తందారీ పాలనకు నిదర్శనమని, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. చట్టబద్ధ పాలనకు పాతరేసి, అరాచకం పెచ్చరిల్లుతుంటే, మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఈ పాలకులను కొనసాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సుబ్బారావు కుమార్తెను పరామర్శించిన సంజీవ్‌, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోసారి పెద్ద మనసును చాటుకున్న చంద్రబాబు- చేనేత ఆత్మహత్య కుటుంబానికి అన్నీ తానై ఉంటానని భరోసా - CBN Support to suicide Family

పేదల భూములు ఆక్రమించుకుంటున్నారు: వైసీపీ నాయకుల భూదాహంతో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ తెలుగుదేశం చేనేత విభాగ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మృతుడి కుటుంబ సభ్యులకు చెందేలా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములు ఆక్రమించుకుంటున్నారని వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులపై, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ, కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు - DSP on Subbarao family Suicide

డీజీపీని విధుల నుంచి తప్పించాలి: చేనేత కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై 24గంటల్లోగా పోలీసులు చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న డిమాండ్‌ చేశారు. లేదంటే డీజీపీ రాజేంద్రనా‌థ్‌రెడ్డిని విధుల నుంచి తప్పించాలని ఈసీకీ లేఖ రాస్తామన్నారు.

పక్కదారి పట్టిన సూసైడ్​ నోట్​ - చెడు అలవాట్ల వల్లే అప్పులని పోలీసుల వక్రభాష్యం - DSP on Subbarao Family Suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.