ETV Bharat / state

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు - నేడు వికారాబాద్​ తీసుకెళ్లి విచారణ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 7:57 AM IST

Key Facts Revealed in Praneeth Rai Remand Report
SIB Ex DSP Praneeth Rao Case Update

SIB Ex DSP Praneeth Rao Case Update : కీలకమైన ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. ప్రణీత్ రెండో రోజు కస్టడీలో అతని వద్ద నుంచి ధ్వంసం చేసిన ఆధారాల జాడను అధికారులు కనిపెట్టారు. కార్యాలయంలోని 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వికారాబాద్ అడవిలో పడేసినట్లు ప్రణీత్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు

SIB Ex DSP Praneeth Rao Case Update : హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన ప్రణీత్ రావును విచారణ (Praneeth Rao Taken into Police Custody) నిమిత్తం న్యాయస్థానం అనుమతితో ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు అతన్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారించిన పోలీసులు సోమవారం రోజున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారగా ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ ఠాణా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

గేట్లు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించలేదు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులను మాత్రమే లోనికి పంపారు. ఐదేళ్లపాటు ఎస్​ఐబీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రణీత్ రావుకు నిఘా సమాచారం ఎంత కీలకమైందో తెలియంది కాదు. అంతటి ప్రాధాన్య సమాచారం చెరిపేశాడని, ధ్వంసం చేశాడన్నది ఆయనపై అభియోగం. ఇదే విషయంపై విచారణాధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు!

SIB Ex DSP Evidence Destruction Case : అసలు సమాచారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రత్యేకంగా కొన్ని హార్డ్‌ డిస్కులనే ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం. మొత్తం 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఇదివరకే అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు సేకరించలేకపోయారు. రెండో రోజు విచారణ సందర్భంగా ఈ హార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేశానని ప్రణీత్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌ను వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ అతడిని వికారాబాద్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రణీత్‌తో కలిసి ఎస్​ఐబీలో పనిచేసి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని పోలీసుల పిలిపించారు.

శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్‌తో కలిసి ఆ సీఐ పని చేసినట్లు గుర్తించారు. ఎన్నికలు ముగిశాక మళ్లీ నల్గొండలోని ఓ పోలీస్ స్టేషన్‌కు ఆయన బదిలీ అయ్యారు. ప్రణీత్ కార్యకలాపాల్లో ఆయనకూ భాగస్వామ్యం ఉంటుందన్న ఆనుమానంతో సోమవారం అతన్ని పిలిపించి విచారించారు. అనంతరం ఆయనను పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రణీత్ వ్యవహారంలో (Phone Tapping Case on Praneeth Rao) కేసు నమోదు చేసింది పంజాగుట్ట పోలీసులే అయినా విచారణ కోసం ఇతర అధికారులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా నిఘా విభాగంలో అనుభవం ఉండి, ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితోపాటు మరో ఇద్దరితో కలిపి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రణీత్ విచారణ అంతా వారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది.

ప్రణీత్​రావు రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?

రెండో రోజు ప్రణీత్​రావు విచారణ - బంజారాహిల్స్ పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించని పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.