ETV Bharat / state

ప్రణీత్​రావు రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 12:41 PM IST

Updated : Mar 15, 2024, 1:38 PM IST

Praneeth Rao Case Remand Report
Praneeth Rao Phone Tapping

SIB Ex DSP Praneeth Rao Case Remand Report : ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్​ అయిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రిమాండ్ రిపోర్ట్​లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతడితో పాటు పలువురు ఎస్‌ఐబీ సిబ్బందిని విచారించిన అధికారులు, ప్రణీత్​ మూడు రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.

SIB Ex DSP Praneeth Rao Case Remand Report : ఫోన్​ ట్యాపింగ్​, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్​(ఎస్​ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్​ రిమాండ్​ రిపోర్టులో పలు కీలక విషయాలను అధికారులు వెల్లడించారు. కేసులో భాగంగా అతడితో పాటు పలువురు ఎస్​ఐబీ సిబ్బందిని(Special Intelligence Branch Staff) అధికారులు విచారించారు.

ఇటీవల ప్రణీత్​రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ప్రణీత్​రావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఛేదనకు ఆరుగురు సభ్యులతో బృందం ఏర్పాటైంది. ప్రణీత్‌రావు నుంచి 3 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

Ex DSP Praneeth Rao Arrest Case Update : ప్రధానంగా సాక్ష్యాల(Evidences) చెరిపివేత, ప్రజా ఆస్తులను ప్రణీత్‌ ధ్వంసం చేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్‌కు ప్రణీత్‌ పాల్పడినట్లు సందేహిస్తున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా మాజీ డీఎస్పీ ట్యాపింగ్‌ చేసినట్లు గుర్తించిన అధికారులు, ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రణీత్‌ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో కనెక్షన్‌ ఏర్పాటు చేసినట్లు అంచనా వేస్తున్నారు. కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం - ప్రణీత్​ రావు సహా మరికొంత మందిపై కేసు నమోదు

డిసెంబర్‌ 4న రాత్రి హార్డ్‌డిస్క్‌లో డేటా ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్నికల ఫలితాలు(Election Results) వెలువడిన మరుసటిరోజే ఈ ఘటన జరగటం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. అదేవిధంగా పాత హార్డ్‌డిస్క్‌ పేరుతో కొత్త హార్డ్‌ డిస్క్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా అతను ఎవరెవరి సీడీఆర్​, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాను సేకరించాడు, ఎవరి ఆదేశాల మేరకు సేకరించాడు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Praneeth Rao Phone Tapping Case : ఇదిలా ఉంటే ప్రణీత్​పై పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు, తన కుటుంబ సభ్యులందరిని మానసికక్షోభకి గురి చేశారని ఆ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి(Real Estate Merchant) ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిజానికి ప్రణీత్‌రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. ఆ విభాగం మొదట ప్రధాన ఇంటెలిజెన్స్‌లోని సీఐసెల్ పర్యవేక్షణలో ఉండేది.

ఆ తర్వాత దాన్ని దాదాపు పది సంవత్సరాల క్రితమే ఎస్‌ఐబీకి మార్చారు. అప్పటి నుంచి బేగంపేట నుంచి పనిచేస్తున్న ఆ విభాగంలోనికి 2018లో వచ్చిన ప్రణీత్‌రావు, ఇటీవలి కాలం వరకు అక్కడే డీఎస్పీగా కొనసాగారు. సాధారణంగా ఈ బ్రాంచ్​లో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన కార్యాచరణ మాత్రమే కొనసాగుతుంది. కానీ ప్రణీత్‌ బృందం మాత్రం అందుకు భిన్నమైన పాత్రను పోషించినట్లు తెలుస్తోంది.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్​

'తన హోదాను అడ్డుపెట్టుకొనే ఇలా విరుద్ధంగా చేశారు' - కాల్​ ట్యాపింగ్​ కేసులో నిజాలు

Last Updated :Mar 15, 2024, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.