ETV Bharat / state

ఈసారైనా బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు దక్కేనా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 8:05 PM IST

Railway Budget Allocation Reduced For Telangan
Railway Budget Allocation

Railway Budget Allocation Reduced For Telangana : బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం సరైన నిధులు కేటాయించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ నిధుల కేటాయింపు వల్లే రైల్వే నెట్​వర్క్ పరంగా తెలంగాణ దేశంలో 15వ స్థానంలో, రాష్ట్రాల వారి నిధుల కేటాయింపుల్లో 18వ స్థానంలో కొనసాగుతోంది. కనీసం ఈ బడ్జెట్‌లో అయినా సరైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. అలాగే జోన్ పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రైల్వే బడ్జెట్ తెలంగాణకు నిధుల కోత - జోన్‌ పరిధిలో ఖాళీలను భర్తీ చేయాలని కార్మికుల డిమాండ్‌

Railway Budget Allocation Reduced For Telangana : ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు కూడా ఉంటాయి. రైల్వే జోన్ల వారీగా వెళ్లే ప్రతిపాదనలే కేటాయింపుల్లో కీలకమవుతాయి. ప్రతి సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే జోన్ల వారీగా వెళ్లే ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపిస్తుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అలాంటి సమావేశమే నిర్వహించ లేదు. దీంతో నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయో అనే ఆందోళన రాష్ట్ర ప్రజల్లో కన్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రూట్ కిలోమీటర్ల రైల్వే లైన్లలో రాష్ట్రంలో అతి తక్కువ రూట్ కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 68,908 రూట్ కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ సంఖ్య 1,999.35 కిలోమీటర్లు మాత్రమే కల్గి ఉంది. అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం కేవలం 2.9శాతం మాత్రమే కలిగి ఉంది. రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆదిలాబాద్‌ టు పటాన్‌చెరు వద్దు, ఆర్మూర్ టు ఆదిలాబాదే ముద్దు - రైల్వే లైన్​ కోసం జిల్లా ప్రజల పోరుబాట

Allocation of Rs. 4,418 crore to Telangana : బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు సరిగ్గా లేకపోవడంతోనే మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉందనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రైల్వే నెట్ వర్క్ పరంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం 15వ స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీ నిధుల కేటాయింపుల్లో మాత్రం రాష్ట్రం గత ఏడాదిలో 18వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు రైల్వేశాఖ తక్కువ నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా రూ.17,507 కోట్లు కేటాయించగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేవలం రూ.4,418 కోట్లు నిధులు మాత్రమే కేటాయించారు.

Railway Budget In Telangana : మంజూరైన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా సాగుతుండగా ఇటీవలి సంవత్సరాల్లో వచ్చిన ప్రాజెక్టులకు మొక్కువడి నిధులే విదిలిస్తున్నారని రైల్వే రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.29,581 కోట్లు కాగా...గత ఏడాది కేటాయించించిది కేవలం రూ.4,418 కోట్లు మాత్రమేనని, ఇంకా పాతిక వేల కోట్లకు పైగా నిధులు అవసరం ఉందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే మొత్తం జోన్ పరిధిలో 6,560 రూట్ కిలోమీటర్ల (ఆర్.కే.ఎం) మేర రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 1,999.35 రూట్ కిలోమీటర్లు వరకు ఉంది.

SCR in Budget 2022-23 : సింగిల్ లైన్లు - 1,193.69 కిలోమీటర్లు, డబుల్ లైన్లు - 675.80కిలోమీటర్లు, ట్రిపుల్ లైన్లు 117.83 కిలోమీటర్లు, క్వాడ్రుపుల్ 12.03 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులకు సరైనవిధంగా నిధుల కేటాయింపులు జరగకపోవడంతో ఏళ్ల తరబడి పనులు కొనసాగుతున్నాయి. ప్రతీ బడ్జెట్‌లోనూ అతి తక్కువ నిధులు కేటాయించడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండిండ్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. 2013-14లో మంజూరైన మణుగూరు - రామగుండం ప్రాజెక్టును తొమ్మిదేళ్లుగా పక్కన పెట్టారు.

'రైలు టికెట్​పై ప్రతి ప్రయాణికుడికి 55% రాయితీ'- రైల్వే మంత్రి కీలక ప్రకటన

తగ్గిన రైల్వే బడ్జేట్‌ కేటాయింపులు : గత ఏడాది ఈ ప్రాజెక్టుకు మెక్షం లభించింది. ఈ మార్గం దూరం 200కి.మీల వరకు ఉంటుంది. రూ.1,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. పనుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఈ ప్రాజెక్టుకు రూ.10కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి కనీసం 20శాతం నిధులైనా కేటాయించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్‌ను హైదరాబాద్‌తో అనుసంధానించే మనోహరాబాద్ -కొత్తపల్లి ప్రాజెక్టుకు ఆశించిన మేరకు నిధులు కేటాయించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు 2006-07లో మంజూరైంది. ప్రాజెక్టు మంజూరై 17 ఏళ్లు గడిచిపోయాయి.

రైల్వే బడ్జేట్‌ పెంచాలి : 151కి.మీల నిర్మాణ పనులకు కేవలం 44కి.మీల దూరం పనులు మాత్రమే పూర్తయ్యాయి. బడ్జెట్‌లో తక్కువ నిధుల కేటాయింపులు, భూసేకరణలో జాప్యం పనుల పురోగతిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో అయినా అధిక శాతం నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీబీనగర్-గుంటూరు వయా నల్గొండ మిర్యాలగూడ రెండో లైను నాలుగేళ్ల క్రితం 2019-20లో మంజూరైంది. ప్రాజెక్టు దూరం 248కి.మీల వరకు ఉంటుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,480 కోట్లు కాగా ఇప్పటి వరకు కేటాయించిన నిధులు రూ.60కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టుకు ఈసారైనా అధిక నిధులు కేటాయించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఆధునిక వసతులు, ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ఎయిర్​పోర్ట్- ఆలయంలా రైల్వే స్టేషన్!

రైల్వే శాఖ గుడ్​న్యూస్- ఆ ప్రయాణికులకు బెడ్​ కిట్​- ఐటమ్స్​ లిస్ట్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.