ETV Bharat / state

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్ - ఈ కేవైసీ గడువును పెంచిన కేంద్రం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 12:08 PM IST

Etv Bharat
Etv Bharat

Ration Card KYC Last Date Extended : కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఈ -కేవైసీ గడువును పొడిగించాలని నిర్ణయించింది. ప్రస్తుత గడువు ఈనెల 31తో ముగుస్తుండగా, ఫిబ్రవరి నెలఖారు వరకు కేవైసీ గడువును పెంచింది.

Ration Card KYC Last Date Extended : రేషన్‌ కార్డుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గడువు జనవరి 31తో ముగుస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డులను (Ration Card E KYC) ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. తెలంగాణలో రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తయిందని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Ration Card E KYC Last Date : తెలంగాణలో 2014 నుంచి రేషన్ కార్డుల (Ration cards in Telangana) ప్రక్షాళన చేపట్టలేదు. మరణించినవారి పేర్లు, వివాహాలు చేసుకొని వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యం కోటాను తీసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. దీంతో బోగస్ రేషన్​ కార్డుల ఏరివేతతోపాటు రేషన్ సరకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు అప్​డేట్​​ కొరకు, గత సంవత్సరం సెప్టెంబరులో ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను మరోసారి సేకరిస్తున్నారు.

అలర్ట్​ - రేషన్​ కార్డుల KYC లాస్ట్​డేట్​ వచ్చేసింది!

ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ :

  • రేషన్‌ కార్డులో పేరు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీప రేషన్‌ దుకాణానికి వెళ్లి 'ఈ-పాస్‌' యంత్రంలో మరోసారి వేలిముద్రలు వేయాలి.
  • అక్కడ మీరు వేలి ముద్ర వేయగానే రేషన్‌కార్డు నంబర్‌తో పాటు కార్డు సభ్యుల ఆధార్‌కార్డు నంబర్ చూపిస్తుంది.
  • వీటిని సరి చూసిన తరువాత ఆ మిషన్​లో గ్రీన్ లైట్ వెలిగి సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది.
  • ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం చేసుకోవచ్చు. దీంతో రేషన్‌ కార్డ్‌ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు.
  • రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్‌షాప్‌కి వెళ్లాలి.

బోగస్​ రేషన్​ డీలర్లకు చెక్​: దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి రేషన్‌షాప్‌లకు వెళ్లి ప్రక్రియ పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించినట్టు అధికారులు తెలిపారు. కానీ ఈ ప్రక్రియ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మినహా హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో ప్రక్రియ మాత్రం మెల్లగా సాగుతోందని చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి 20-30శాతం మేర కార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటు బోగస్​ రేషన్​ డీలర్లకు సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయని హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిని గుర్తించినట్లు వారు వెల్లడించారు.

How Many Types of Ration Cards in India : మీరు ఏ రకమైన రేషన్ కార్డు కలిగి ఉన్నారో.. వాటి లాభాలేంటో తెలుసా..?

Ration Card E KYC in Telangana : మరోవైపు రేషన్ కేంద్రాల్లో చాలా మంది ఈ-కేవైసీ పూర్తికావడం లేదు. దీనికి రేషన్ ​కార్డుదారులు ఆధార్‌ కార్డు అప్​డేట్​ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు అంటున్నారు. దీంతో ప్రజలు ఆధార్‌లో మార్పుల కోసం ఆధార్‌ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఇవి కూడా తగినన్ని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రేషన్ కార్డు కావాలా? - కేవైసీ చేయకపోతే ఏం జరుగుతుంది?

రాష్ట్రంలో రేషన్‌ తీసుకోని వారు అంతమంది ఉన్నారా - మరి వారి పరిస్థితి ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.