ETV Bharat / state

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 12:29 PM IST

Updated : Mar 6, 2024, 2:22 PM IST

PIL_in_High_Court_on_Volunteers_in_Election_Duties
PIL_in_High_Court_on_Volunteers_in_Election_Duties

PIL in High Court on Volunteers in Election Duties: ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం జగన్ చేసిన రాజకీయ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంబంధిత వ్యవహారాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని వ్యాజ్యంలో కోరారు.

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్

PIL in High Court on Volunteers in Election Duties: ఎన్నికలకు సంబంధించిన విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీకి ప్రయోజనం కలిగే విధంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయాలని, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సపోర్టు చేయవద్దని వాలంటీర్లను సీఎం కోరారని వ్యాజ్యంలో తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ పిల్ వేశారు.

జగన్ అక్రమాస్తుల కేసు - 2 నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ఎన్నికల్లో నిష్పాక్షికంగా పనిచేస్తారని ఆశించలేమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్వహించిన వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన రాజకీయ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లకు ఎన్నికల సంబంధించిన పనులు అప్పగించకుండా చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ), కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పోలింగ్‌ బూత్‌ ప్రాంగణాల్లోకి వెళ్లకుండా వాలంటీర్లను నిరోధించాలని అభ్యర్థించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా ఎన్నికల అధికారులంతా సరైన స్ఫూర్తితో అమలు చేసేలా సీఈఓను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. వాలంటీర్లను అభినందిస్తూ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవం, జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాల నిర్వహణ, అందుకు సంబంధించి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా సొమ్ము వెచ్చించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల ద్వారా అంతిమ ప్రయోజనం వైసీపీ పొందిందన్నారు.

ఓట్ల తొలగింపులో ఇదేం మూస ధోరణి- ఎన్నికల అధికారులపై హైకోర్టు మండిపాటు

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చుచేసిన సొమ్మును వైసీపీ ప్రధాన కార్యదర్శి నుంచి రాబట్టేలా ఆదేశించాలన్నారు. ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం సిగ్గుచేటు అన్నారు. వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరుతో విమర్శిస్తూ సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

కార్యక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చు, బాధ్యులైన అధికారుల పాత్రపై విచారణ జరిపేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన రాజకీయ ప్రసంగంపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, సీఈవోకు ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. తక్షణమే నివేదిక ఇచ్చేలా కలెక్టర్‌ను ఆదేశించాలన్నారు.

భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత కాంక్రీట్‌ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

Last Updated :Mar 6, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.