ETV Bharat / state

తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే: పవన్​ కల్యాణ్​ - Pawan kalyan Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 8:50 AM IST

pawan_kalyan
pawan_kalyan

Pawan Kalyan Comments on Tuni Train incident in Kakinada District : కాపు రిజర్వేషన్​ ఉద్యమం వైఎస్సార్సీపీ కనుసన్నల్లోనే జరిగిందని పవన్​ కల్యాణ్​ పేర్కొన్నారు. సీఎం జగన్​ కిరాయి మూకలను పెట్టి తుని వద్ద రైలు దహనం చేయించారని పేర్కొన్నారు. రైలు దహనం కేసులో అమాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే: పవన్​ కల్యాణ్​

Pawan Kalyan Comments on Tuni Train incident in Kakinada District : తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైఎస్సార్సీపీ నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్​ కిరాయి మూకల్ని పెట్టి రైలుని తగలబెట్టించారని ఆరోపించారు. అదే సమయంలో కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి ఉంటే తానెందుకు ఓడిపోతానని ప్రశ్నించారు.

Pawan Election Campaign : కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ సర్కార్‌ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. పోలవరం కాల్వల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు వందల ఎకరాల్లో చెరువులు కబ్జా చేశారన్నారు. కనీసం కొండను కూడా మిగలకుండా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి నిధులు లేక 60 వేల ఎకరాలు బీడుగా మారిందని పవన్‌ అన్నారు. కిర్లంపూడిలోని రవాణా, చిరువ్యాపారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్‌ అని చెప్పిన జగన్‌ ఎస్సీ, ఎస్టీ లను మోసం చేశారని ధ్వజమెత్తారు.

పచ్చని కోనసీమలో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు రాజేసింది: పవన్‌ - Pawan Kalyan Public Meeting

Pawan Comment on YSRCP Govt : కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్‌కు ఎలా ఓటు వేయమని అడుగుతారని వైఎస్సార్సీపీ కాపు ఎమ్మెల్యేల్ని పవన్ ప్రశ్నించారు. కాపు ఉద్యమం అనేది వైఎస్సార్సీపీ కుట్రేనని పవన్‌ ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేసిన విధ్వంసంలో సామాన్యులపై కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు హోం గార్డులకు రావాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

'ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకు నీరు' - కూటమి ప్రభుత్వ లక్ష్యం : పవన్‌ - Pawan Kalyan Election Campaign

"ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారంతా రిజర్వేషన్​ కోరుకుంటారు. నేను కులనాయకుణ్ని కాదు. కాపులను తాకట్టు పెట్టేస్తున్నావ్​ అని నాయకులు నన్ను విమర్శించారు. కాపు వర్గంలో నేను పుట్టినా అన్ని వర్గాల వారిని నా గుండెల్లో పెట్టుకున్నాను "-పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

రాష్ట్రప్రజల కోసం తానొక కూలీలా పని చేస్తానని యువతకు దిశానిర్దేశం చేసి వారిలో ఉన్న శక్తిని బయటకు తీస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. పదేళ్లుగా పోరాడుతూనే ఉన్నానన్న పవన్‌ జనసేనకు అండగా నిలిస్తే సగటు మనిషి గొంతును అసెంబ్లీలో వినిపిస్తానని చెప్పారు.

ఐదేళ్లు పరదాల చాటున తిరిగారు - దోపిడీ కుటుంబాన్ని తరిమికొట్టాలి: చంద్రబాబు, పవన్ - CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.