ETV Bharat / state

ఐదేళ్లు పరదాల చాటున తిరిగారు - దోపిడీ కుటుంబాన్ని తరిమికొట్టాలి: చంద్రబాబు, పవన్ - CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 8:54 AM IST

CHANDRABABU_PAWAN_KALYAN_PRAJAGALAM
CHANDRABABU_PAWAN_KALYAN_PRAJAGALAM

CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM: రాయలసీమలో వైసీపీను నేలకూల్చాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని, దోపిడీ సొమ్మును కక్కిస్తామని తేల్చి చెప్పారు.

ఐదేళ్లు పరదాల చాటున తిరిగారు - దోపిడీ కుటుంబాన్ని తరిమికొట్టాలి: చంద్రబాబు, పవన్

CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM: రోజుకో సింపతీ డ్రామాతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ యత్నిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరులో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి బహిరంగసభల్లో పాల్గొన్న చంద్రబాబు, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు మూడు సెంట్ల చొప్పున స్థలమిచ్చి, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు- నగరి కాలువను పూర్తి చేసి, కృష్జా జలాలను తీసుకొస్తామన్నారు. సీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందన్న చంద్రబాబు, కూటమి వచ్చాక అక్రమార్కులకు సంకెళ్లేస్తామని హెచ్చరించారు.

ఇసుక దోపిడీతోనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది- రాజంపేట బాగుపడాలంటే వైసీపీ ఓడిపోవాలి: చంద్రబాబు,పవన్ - Chandrababu Satirical Comments

ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తా: కూటమి అధికారంలోకి రాగానే ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తానని, చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్‌‌కి సీటిచ్చారంటే వీరి నిబద్దత ఏంటో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఒక అహంకారి, ఒక విధ్వంసకారి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం ఈ జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. పేదల జీవితాల్లో మార్పు రావాలన్నా, వెలుగు రావాలన్నా సైకోని తరిమికొట్టాలని అన్నారు.

జగన్ రెడ్డి గత ఎన్నికల్లో చెల్లిని, తల్లిని వాడుకుని గెంటేసి దాన్ని తమపైకి నెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో జరిగే గొడవల్ని తమపైకి నెట్టి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకాను ఎమ్మెల్సీగా ఓడించింది జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వొద్దని, అవసరమైతే షర్మిలకు ఇవ్వమంటే వివేకాపై దాడి చేసి చంపేశారని విమర్శించారు. సమాధానం చెప్పమని సునీత రెడ్డి ప్రశ్నిస్తుంటే తమపై నింద నెట్టేస్తారా అని నిలదీశారు. భార్య మాట విని తల్లిని గెంటేసినోడు ప్రజలకు ఏం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించారు. అమాయకుడిగా మొహం పెట్టి, నేరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్ రెడ్డి అని చంద్రబాబు దుయ్యబట్టారు.

వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం - బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం: చంద్రబాబు, పవన్​ - chandrababu pawan kalyan prajagalam

Pawan Kalyan Comments: రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమితో జత కట్టామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రగతి కావాలంటే దోపిడీదారులను సాగనంపాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 35 మంది చనిపోయి అనేకమంది నిరాశ్రయులైనా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కల్యాణ్​ విమర్శించారు.

జగన్, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి ఎన్నాళ్లు భయపడతారన్న పవన్‌, ఎన్నికలంటేనే భవిష్యత్తులో వైసీపీ భయపడాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తామని, సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అనుభవం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమని, పోలీసులకు ఒకటో తేదీన జీతాలు రావాలి, వారాంతపు సెలవు ఇవ్వాలని అన్నారు. రైల్వేకోడూరు సమస్యలను తాను దగ్గరుండి పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రైల్వేకోడూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్‌, మోదీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. అండగా ఉండి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలయ్యాక జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ కల్పనకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్న నేతలు, జగన్ పాలనలో మోసపోయిన ఉద్యోగులను ఆదుకుంటామన్నారు.

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు - Chandrababu Speech

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.