ETV Bharat / politics

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు - Chandrababu Speech

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 10:28 PM IST

Chandrababu Speech at Public Meeting in Nellimarla Constituency: ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఈ సారి వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. జగన్ తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును చెప్పగలరా అని నిలదీశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.

chandrababu_speech
chandrababu_speech

Chandrababu Speech at Public Meeting in Nellimarla Constituency: జగన్ పాలనలో దేవాలయాలకూ రక్షణలేకుండా పోయిందని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును చెప్పగలరా అని నిలదీశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్​పై పలు విమర్శలు చేశారు. మా సభలకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందని అన్నారు. ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైసీపీ నేతలకు ఈ సారి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు జోస్యం చెప్పారు.

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి - కేంద్రంతో మాట్లాడి జూట్​మిల్ తెరిపించేందుకు కృషి చేస్తా: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech

వైసీపీ పాలనలో 160 దేవాలయాలపై దాడులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టు తెచ్చారా ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర బాగు కోసమే భోగాపురం విమానాశ్రయం తెచ్చామని అన్నారు. మేం అధికారంలో ఉంటే భోగాపురం విమానాశ్రయం ఇప్పటికే పూర్తయ్యేదిని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ఇక్కడి భూములన్నీ పచ్చగా మారతాయని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచిపనుల కోసం వాడాలి కాని వైసీపీ ప్రభుత్వం దోచుకోవడానికి వాడిందని ఆరోపించారు. అందరూ తనకింద బానిసలుగా బతకాలని జగన్‌ కోరుకుంటారని చంద్రబాబు ఆన్నారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు- ఆ ఆరుగురు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి: పవన్‌ ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. పవన్ కల్యాణ్‌కు, జగన్‌కు అసలు పోలిక ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ ఓ అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు అని చెడ్డవారిని ఓడించేందుకు మంచివాళ్లంతా ఏకం కావాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటు అయిపోయిందని ఈ సారి గులకరాయి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు గాని, ప్రాజెక్టు పేరు గాని జగన్‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. పేదవారికి చెరువులు, శ్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా అని అడిగారు. అసమర్థ, అవినీతి పాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయని ఆగ్రహించారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించి ప్రజలకు పంచాలని చంద్రబాబు అన్నారు.

పవన్​కు ఎన్ని కార్లు ఉన్నాయంటే!- వాటి ధరెంతో తెలుసా? - pawan kalyan nomination

అభిమానం ఉంటే సరిపోదు అభ్యర్థులను గెలిపించాలి: రాష్ట్రం, ప్రజల బాగు కోసం కూటమి నేతలు ఎన్నో త్యాగాలు చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మాపై అభిమానం ఉంటే సరిపోదు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి చేసే పార్టీలకే ఓటేయాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ఇక్కడి ఎమ్మెల్యే దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నెల్లిమర్లలోని కొండలన్నీ మింగిన అనకొండ అప్పలనాయుడు అని అన్నారు. ఈ అనకొండ ఎమ్మెల్యే పూసపాటిరేగలోని గ్రావెల్ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామని, తారకరామతీర్థ సాగర్‌ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందని చంద్రబాబు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.