ETV Bharat / state

కన్ను పడిందా కాజేయడం పక్కా - పార్కింగ్ కార్లే టార్గెట్​గా అంతర్​రాష్ట్ర దొంగల చేతివాటం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 7:19 PM IST

Thief Arrested for Stealing Bikes at Tandur
Two Arrested for Stealing from Parked Cars

Parked Cars Theft Telangana 2024 : పార్కింగ్​ చేసిన వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్​రాష్ట్ర దొంగలు అరెస్టు అయ్యారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని పోలీసులు రహదారిపై తనిఖీలు నిర్వహించగా, గత కొన్ని రోజుల నుంచి కార్ల దొంగతనాలు చేస్తున్న నిందితులు పట్టుబడ్డారు.

పార్కింగ్ చేసిన కార్లలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్టు - మరో కేసులో 12 బైకులను దొంగిలించిన వ్యక్తి అరెస్టు

Parked Cars Theft Telangana 2024 : ఆగి ఉన్న వాహనాలే వాళ్ల టార్గెట్. పని మీద పార్కింగ్ చేసి వెళ్లావో అంతే సంగతి. ఆ కేటుగాళ్ల కన్ను పడిందంటే చాలు కార్లలో ఉన్నది ఏదైనా సరే, ఎంతైనా సరే ఇట్టే కొట్టేసి మాయమైపోతారు. వాహనాదారులను ఓ కంట కనిపెడుతూ అనుమానం రాకుండా కారు అద్దాలు పగల గొట్టి అందులో ఉన్న విలువైన పత్రాలు, డబ్బులు, చరవాణులు ఇలా ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయో ఇక అంతే సంగతి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలనే టార్గెట్​గా చేసుకొని అద్దాలు పగల గొట్టి డబ్బులు దొంగిలించే ఇద్దరు అంతర్​రాష్ట్ర దొంగలను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం : నిందితులు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాకు చెందిన పిట్ల మహేశ్​(36), ఆవుల రాకేశ్(26) గత కొంత కాలంగా రాష్ట్రంలోని దొంగతనం చేస్తున్నారు. వీరు రోడ్లపైగానీ, బ్యాంకుల ముందుగానీ పార్క్​ చేసిన కార్లను గమనించి ఆ వాహనాల అద్దాలు పగలకొట్టి విలువైన వస్తువులు, నగదును దొంగలిస్తున్నారు.

ఈరోజు ఉదయం బాదలాపురం బస్టాండ్ వద్ద కోదాడ-జడ్చర్ల హైవే(Highway) 167 రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. 2.77 లక్షలు నగదు, రెండు సెల్​ఫోన్లు, ఒక కారు, ఇతర పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని రూరల్ వన్ టౌన్ పీఎస్​లో నిందితులపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

'నిందితులు చాలా రోజుల నుంచి రెండు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నారు. 2023, 2024లో వీరి మీద మిర్యాలగూడలో ఫిర్యాదు వచ్చింది. ఆ కేసులో సుమారు 6 లక్షల నగదు పోయింది. పోలీసులు అందరూ టీమ్​గా ఏర్పడి నిందితులను అరెస్టు చేశాం.'- రాజశేఖర్ రాజ, మిర్యాలగూడ డీఎస్పీ

యువరాజ్ సింగ్​ ఇంట్లో చోరీ - నగలు, డబ్బు మాయం

Thief Arrested for Stealing Bikes at Tandoor : మరోవైపు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర దొంగను వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కురుకుంటా గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ నిఖిల్ గత నాలుగు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గౌతపూర్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ బైక్​పై వచ్చిన నిఖిల్​ను తనిఖీ చేశారు.

ద్విచక్ర వాహన ధ్రువపత్రాలు లేకపోవటంతో పోలీసులకు అతని మీద అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు మొత్తం 12 బైకులను దొంగిలించాడని బయటపడింది. వికారాబాద్, తాండూర్​తో పాటు హైదరాబాద్, లింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలను దొంగిలించి, వాటిని తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలోని షెడ్లో దాచి పెట్టాడని తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. వాహనాలు స్వాధీనం చేసుకుని దొంగను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదేందయ్యా ఇదీ - ఇలాంటోళ్లూ ఉంటారా? - హైదరాబాద్​లో వింత దొంగతనం

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో మొబైల్ దొంగల అరెస్ట్ - రూ.10 లక్షల విలువైన సెల్​ఫోన్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.