ETV Bharat / sports

యువరాజ్ సింగ్​ ఇంట్లో చోరీ - నగలు, డబ్బు మాయం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 1:49 PM IST

Cricketer Yuvraj Singhs House Robbed
Cricketer Yuvraj Singhs House Robbed

Cricketer Yuvraj Singhs House Robbed : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. కొంత మంది దుండగులు ఆయన ఇంటి నుంచి కొంత డబ్బుతో పాటు నగలను దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.

Cricketer Yuvraj Singhs House Robbed : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. పంచకులలోని యువరాజ్ నివాసంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆ ఇంట్లోని తాళం వేసి ఉన్న బీరువాను పగులగొట్టి అందులోని 75 వేల రూపాయల డబ్బుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. హై ప్రోఫైల్ కేస్ అవ్వడం వల్ల అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు

విషయం తెలుసుకుని ఘటనా స్థాలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. యువరాజ్ తల్లి షబ్నమ్ సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం తదుపరి విచారణను చేపడుతున్నట్లు ఈ మేరకు తెలిపారు. అయితే ఆ ఇంట్లో పనిచేసే ఓ వృద్ధునికి కూడా ఈ దొంగతనంలో హస్తం ఉండొచ్చంటూ కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని నోట్​ చేసుకున్న పోలీసులు ఆ కోణం విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

దాదా ఇంట్లో దొంగలు - రూ.1.6 లక్షల ఫోన్ మాయం
Sourav Ganguly Phone : టీమ్​ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ సౌరభ్‌ గంగూలీ మొబైల్​ ఫోన్​ ఇటీవలే చోరీకి గురైంది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయన ఈ ఘటనపై శనివారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫోన్‌లోని వ్యక్తిగత డేటా భద్రతపై ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గంగూలీ స్మార్ట్ ఫోన్ విలువ సుమారు రూ.1.6 లక్షలు ఉంటుందని సమాచారం.

ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో చోరీ - నేషనల్ అవార్డులను ఎత్తుకెళ్లిన దొంగలు
Director Manikandan House Theft : ఇటీవల డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. మధురైలోని ఉసిలంపట్టిలోని ఈ ఘటన జరిగింది. డైరెక్టర్ నివాసానికున్న ఇంటి తాళాన్ని పగులగొట్టిన ఆ వ్యక్తులు, అక్కడ నుంచి సుమారు రూ.లక్ష నగదు, ఐదు సవర్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ సాధించిన జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సంచలనంగా మారడం వల్ల, ఆ దొంగలు మణికందన్​ జాతీయ అవార్డుల పతకాలు తిరిగి ఇచ్చేశారు. ఒక పాలిథిన్ కవర్​లో కట్టి వాళ్ల గోడకు తలిగించి వెళ్లారు. దాంతోపాటు ఓ క్షమాపణ లేఖను కూడా ఆ ప్యాకెట్​లో వదిలి వెళ్లారు. అందులో 'సారీ సర్- మమ్మల్ని క్షమించండి.' అని నోట్​ రాశారు.

డైరెక్టర్ ఇంట్లో చోరీ - నేషనల్ అవార్డులను కూడా ఎత్తుకెళ్లిన దొంగలు

గంగూలీ ఇంట్లో ఫోన్​ చోరీ - డేటాపై దాదా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.