ETV Bharat / sports

గంగూలీ ఇంట్లో ఫోన్​ చోరీ - డేటాపై దాదా ఆందోళన

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 3:17 PM IST

Updated : Feb 11, 2024, 5:07 PM IST

Sourav Ganguly Phone
Sourav Ganguly Phone

Sourav Ganguly Phone : టీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్​ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. ఇందులో ఆయన ఫోన్​ పోయిందని సౌరభ్​ పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్ చేశారు.

Sourav Ganguly Phone : టీమ్​ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ సౌరభ్‌ గంగూలీ మొబైల్​ ఫోన్​ ఇటీవలే చోరీకి గురైంది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయన ఈ ఘటనపై శనివారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫోన్‌లోని వ్యక్తిగత డేటా భద్రతపై ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గంగూలీ స్మార్ట్ ఫోన్ విలువ సుమారు రూ.1.6 లక్షలు ఉంటుందని సమాచారం.

ఇంతకీ ఏం జరిగిందంటే ?
బెహలాలోని తన నివాసానికి ప్రస్తుతం పెయింటింగ్‌ పని చేయిస్తున్నారు. అయితే తన ఫోన్‌ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే సరికి అది కనిపించకుండా పోయింది. ఇల్లంతా గాలించినా కూడా ఆ ఫోన్​ ఎక్కడా కనిపించలేదు. దీంతో వెంటనే గంగూలీ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్​ చేశారు. ఆ ఫోన్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక డేటా ఉండటం వల్ల ఆందోళన గంగూలీ వ్యక్తం చేశారు. అది దుర్వినియోగం కాకుండా త్వరగా ఫోన్‌ను రికవరీ చేయాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని చేస్తున్న వారిని ఈ మేరకు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

"నా ఫోన్ మా ఇంటి నుంచే చోరీకి గురైందని నేను భావిస్తున్నాను. చివరగా నేను జనవరి 19న ఉదయం 11:30 గంటల సమయంలో ఆ ఫోన్‌ని చూశాను. ఆ తర్వాత నుంచి అది కనిపించలేదు. దీంతో నేను ఫోన్ కోసం ఇళ్లంతా వెతికాను. కానీ అది అస్సలు దొరకలేదు. అయితే నా ఫోన్ పోయినందుకు నేను తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఆ ఫోన్‌లో చాలా ఇంపార్టెంట్​ ఫోన్​ నెంబర్లు, నా వ్యక్తిగత సమాచారం చాలా ఉంది. అందుకోసమే వీలైనంత త్వరగా ఆ ఫోన్‌ను ట్రేస్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను." అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాజీ సారథి గంగూలీ పేర్కొన్నారు.

ఆ రూమర్స్​లో నిజం లేదు - అండర్‌-19 వరల్డ్‌ కప్​నకు భారత్ ఆతిథ్యం ఎందుకు ఇవ్వట్లేదంటే?

టీ20 వరల్డ్​కప్​లో రోహిత్, విరాట్ ఉండాల్సిందే- వాళ్లకు ఆ సత్తా ఉంది: గంగూలీ

Last Updated :Feb 11, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.