ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు - వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు - Fire Safety Week celebrations

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 2:08 PM IST

Fire Safety Week celebrations
Fire Safety Week celebrations

Fire Safety Week celebrations in Telangana 2024 : ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. "అగ్నిప్రమాదాల నివారణ చర్యలు చేపడదాం-దేశ సంపదను కాపాడదాం" అనే నినాదంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

Fire Safety Week celebrations in Telangana 2024 : రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. "అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపడుదాం-దేశ సంపదను కాపాడుదాం" అనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆ శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను చేపట్టనున్నట్లు తెలిపిన ఆయన హైదరాబాద్ నగరశివారు వట్టినాగులపల్లి అగ్నిమాపక శిక్షణ కేంద్రంలో వారోత్సవాలను ప్రారంభించారు. నిర్లక్ష్యంగా పొగ తాగడం, విద్యుదాఘాతం, వంట గ్యాస్, ఎక్కువ వేడికి గురయ్యే వస్తువుల కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.

1944 ఏప్రిల్‌ 14న బాంబే పోర్టులో విక్టోరియా పేరిట జరిగిన భారీ పడవ అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్‌ 14న అగ్నిమాపక శాఖ అధికారులు(Fire Department Officials) వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పిస్తూ వస్తున్నారు.

Fire Accidents In Telangana : ఏటా జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. 2021 లో 85 భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. 2022లో వీటి సంఖ్య 104కు చేరింది. 2021లో జరిగిన ప్రమాదాల్లో 25 మంది మృతి చెందగా, 2022లో 45 మంది మృతి చెందారు. 2021లో రూ.996.75 కోట్లు, 2022లో రూ.723.14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను(Assets) ప్రమాదాల్లో కాపాడారు. అదే ఏడాది సికింద్రాబాద్‌ క్లబ్‌లో రూ.15 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదాలు పునరావృతం కావొద్దంటే ప్రజల్లో అవగాహన(Awereness Among the People) ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

Fire Week In Telangana: వారం రోజులు.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు

"ఏప్రిల్ 14-20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తాం. ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం డీజీ సూచనల మేరకు వీటిని నిర్వహిస్తున్నాం. వారోత్సవాల్లో బాగంగా అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై అందరికీ అవగాహన కల్పించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం" - మోహన్​రావు, అగ్నిమాపక శాఖ అధికారి

ప్రస్తుతం రాష్ట్రంలో 146 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, 2734 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు 256 పొరుగు సేవల సిబ్బంది 15 ఫైర్‌ ఔట్‌ పోస్టుల్లో పనిచేస్తున్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు రూ.32.12కోట్ల బడ్జెట్‌ను(Budget) కేటాయించింది. అందులో భాగంగా ప్రమాదాలు(accidents) జరగకుండా అరికట్టాలనే ఉద్దేశంతో నివారణ చర్యలు(precautionary measures) తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు.

అగ్నిమాపక వారోత్సవాలు : రాష్ట్రంలో ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ అధికారులు కార్యక్రమాలు నిర‌్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గోడ పత్రికలు ఆవిష్కరించనున్నారు. అవగాహన కల్పించడమే కాక విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, మాక్‌ డ్రిల్స్‌ వంటివి నిర్వహించనున్నారు.

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం: శేఖర్‌ కమ్ముల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.