ETV Bharat / state

లిక్కర్‌ కేసులో బీజేపీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? : మంత్రి కొండా సురేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 5:39 PM IST

Minister Konda Surekha Fires on MLC Kavitha : బీఆర్ఎస్ నేతల తీరు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎమ్మెల్యే కొండా సురేఖ విమర్శించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా ఉండటానికి ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అని మంత్రి దుయ్యబట్టారు.

MLA Aadi Srinivas Fires on MLC Kavitha
Minister Konda Surekha Fires on MLC Kavitha

Minister Konda Surekha Fires on MLC Kavitha : భద్రాద్రి శ్రీరాముల వారి కల్యాణానికి కేటీఆర్ కొడుకు హిమాన్షు పట్టు వస్త్రాలను ఏ హోదాలో సమర్పించాడో కవిత సమాధానం చెప్పాలని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని పేర్కొన్నారు. లిక్కర్ రాణిగా కవిత(Kavitha) పేరుగాంచిందన్న మంత్రి, ఆ కేసులో బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తీరు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న ఆమె, కవితకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఉద్ఘాటించారు.

MLA Aadi Srinivas Fires on MLC Kavitha : అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటున్న ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజున కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించలేదన్నారు.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనీ కవిత పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు. ఈడీలు ప్రశ్నిస్తే దిల్లీకి వెళ్లి మహిళా బిల్లంటూ కవిత నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు బలహీనవర్గాలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం బలహీన వర్గాల కులగణన చేపడుతున్నట్లు చెప్పారు. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన బీఆర్‌ఎస్‌ నుంచి తాము నేర్చుకోవాల్సిందేమీ లేదన్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Vemulawada Temple) ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఇచ్చిన హామీని గత ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదనీ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. 2016లో వీటీడీఏ జీవో తీసుకొచ్చి వందల కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి రంగురంగుల బ్రోచర్లలో అభివృద్ధి చూపారని విమర్శించారు. అభివృద్ధి కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ నుంచి సాప్ట్‌లోన్ కింద రూ.30 కోట్ల నిధులు మంజూరు కాగా రూ.20 కోట్లు వెనక్కి వెళ్లినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

"ఏ హోదాలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వస్తారని కవిత ప్రశ్నించారు. నేను కవితను సూటిగా అడుగుతున్న, భద్రాద్రి రాముడికి కేటీఆర్‌ కుమారుడు ఏ హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించాడు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారు. నిధుల దుర్వనియోగంపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు". - కొండా సురేఖ, మంత్రి

లిక్కర్‌ కేసులో బీజేపీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? మంత్రి కొండా సురేఖ

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా : మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.