ETV Bharat / state

సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు : సీతక్క

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 1:55 PM IST

Minister Seethakka
Minister Seethakka

గత ప్రభుత్వం సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎప్పటికప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నామని సీతక్క వివరించారు.

సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు

Minister Seethakka on Sarpanch Elections 2024 : సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులకు సంబంధించిన రూ.1200 కోట్లను గత సర్కార్ పక్కదారి పట్టించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. జీతాలు పింఛన్లు చెల్లించడానికి కూడా అక్కడ ఏమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు.

Seethakka Visit Vemulawada Temple : అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదలు అందజేశారు. ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీతక్క వివరించారు.

ఆద్యకళ పరికరాల పరిరక్షణ కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి : మంత్రి సీతక్క

ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నాం : ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు, నిధులను కట్టడాలకు తమ సొంత అవసరాలకు వృధాగా ఖర్చు చేయడం లేదని సీతక్క అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని సీతక్క స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలు గాలికి వదిలేసే అధికారులను ఇంటికి పంపిస్తాం : సీతక్క

Seethakka Fires on BRS : సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలని గత ప్రతిపక్షంలో అసెంబ్లీలో తాము మాట్లాడామని సీతక్క తెలిపారు. అయినా సర్పంచ్‌లను ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై కూడా గులాబీ పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సీతక్క కోరారు.

"సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఉద్యోగులకు ప్రతినెల 5 లోగా జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సంక్షేమం కోసం నిధులను వెచ్చిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలని గత ప్రతిపక్షంలో మాట్లాడాం. అయినా బీఆర్ఎస్ సర్కార్ సర్పంచ్‌లకు రూపాయి కూడా చెల్లించలేదు." - సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి : సీతక్క

అంతా ఖాళీ చేసి ఇచ్చారు - ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు : సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.