ETV Bharat / state

'పద్మవిభూషణు​ల' అభినందనల పర్వం - వెంకయ్యనాయుడిని కలిసిన మెగాస్టార్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 9:15 PM IST

Updated : Jan 26, 2024, 10:37 PM IST

Chiranjeevi Meet Venkaiah Naidu
Megastar Chiranjeevi Meet Venkaiah Naidu

Megastar Chiranjeevi Meet Venkaiah Naidu : దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్​కు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకేరోజు ఇద్దరికీ పద్మవిభూషణ్ వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఆ ప్రత్యేక క్షణాలను మెగాస్టార్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

Megastar Chiranjeevi Meet Venkaiah Naidu : పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇద్దరికి ఒకేసారి పద్మవిభూషణ్ పురస్కారం రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు, చిరంజీవి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. కాసేపు సరదాగా మాట్లాడుకొని తమ జ్ఞాపకాలను(Memories) గుర్తుచేసుకున్నారు.

నా 'పద్మవిభూషణ్' రైతులు, మహిళలు, యువతకు అంకితం : వెంకయ్యనాయుడు

Megastar Chiranjeevi Tweet on Venkaiah Naidu: వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీవి, ఈ పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. ఇద్దరు పద్మ విభూషణులు ఒకే చోట కలిసి, ముచ్చటించిన ఆ ఫోటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి - వెంకయ్య నాయుడు ఇద్దరు ఒకరికొకరు సత్కరించుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట(Social Media) వైరల్ అవుతున్నాయి.

పద్మవిభూషణు​ల అభినందనల పర్వం - వెంకయ్యనాయుడుతో మెగాస్టార్ 'చిరు' హాసం

Padma Awards 2024 : గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం సాయంత్రమే ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కగా, 17 మంది ప్రముఖులకు పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ(Padma Shree) అవార్డులు వరించాయి. మొత్తంగా ఈ ఏడాదిగానూ వివిధ రంగాలకు చెందిన 132 మందికి 'పద్మ' పురస్కారాలు ప్రకటించగా అందులో తెలుగువారు ఎనిమిది మంది.

తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి సినీ కళారంగానికి చేసిన సేవకుగాను భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు. అంతే కాదు రాజకీయాల్లో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా, వక్తగా పేరుగాంచిన మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. దాంతో తెలుగు జాతి ప్రజలు హర్షిస్తున్నారు. ప్రముఖులతో పాటు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా వీరిరువురకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు చిరంజీవి, వెంకయ్యనాయుడిని వేరు వేరుగా కలిసి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Padma Awards Presentation 2024: మన దేశంలో కళ, సామాజికసేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్రసాంకేతికం, ఇంజినీరింగ్‌, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపికచేసి భారత ప్రభుత్వం గౌరవిస్తోంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్‌, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్‌, విశిష్ట సేవలు అందించినవారికి పద్మశ్రీ అవార్డులతో సత్కరిస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదగా ఈ అవార్డులు ప్రదానోత్సవం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డలకు 'పద్మ' పురస్కారం - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

Last Updated :Jan 26, 2024, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.