ETV Bharat / state

సాగర్‌లోని 14 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కేఆర్​ఎంబీ ప్రతిపాదనలు - KRMB Meeting Over Water Crisis

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 3:47 PM IST

KRMB Allotted 14 TMC to Telugu States
KRMB Committee Three Member Meeting Over Water Crisis

KRMB Allotted 14 TMC to Telugu States : తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయింపులు చేసింది. హైదరాబాద్‌ జలసౌధ వేదికగా ఇరు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే భేటీ అయ్యారు. సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరిపేలా చర్చలు జరిపారు. తాగునీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న జలాలను చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు. మే నెలలో మరోమారు సమావేశమై, అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.

KRMB Allotted 14 TMC to Telugu States : నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్ కు 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల నాలుగో తేదీన కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కానందున ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో(Tri-Member Committee Meeting) తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్​లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు.

కేఆర్ఎంబీ కమిటీ సమావేశానికి హాజరు కాని తెలంగాణ, ఏపీ - ఈనెల 12కు మీటింగ్​ వాయిదా - KRMB MEETING postponed

KRMB Meeting Over Water Crisis : అక్టోబర్​లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా, అందులో తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా ఏడు టీఎంసీలు వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ(Engineer in Chief) పేర్కొన్నారు. సాగర్ నుంచి వెంటనే తమకు ఆ ఐదు టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ పేర్కొన్నారు.

శ్రీశైలం నుంచి ఏపీ ఏ అవసరలకు కూడా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. సాగర్ దిగువన తమకు తాగునీటికి(Drinking Water) చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్​తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్​పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు.

రాష్ట్రంలో కరెంటు కోత, తాగునీటి కొరత ఉండొద్దు - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం - CM REVANTH on Water scarcity

మే నెలలో మరోమారు సమావేశం కావాలని నిర్ణయం : హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. దీంతో నాగార్జునసాగర్​లో(Nagarjuna Sagar) 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.

మరోవైపు తెలంగాణలో జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పెద్దగా లేకపోవడంతో జలాశయాలు అడుగుంటుతున్నాయి. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్‌(Sriramsagar Project), దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా, కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ అందడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వండి - తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ - KRMB latter To Both Telugu States

సాగర్ డ్యామ్‌ మరమ్మతులపై ఏపీ అభ్యంతరం - రంగంలోకి కేఆర్‌ఎంబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.