ETV Bharat / state

ల్యాండ్ టైటిల్ యాక్ట్​తో జగన్ ప్రజల ఆస్తుల్ని కాజేస్తారు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan fired on CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:47 PM IST

Updated : Apr 29, 2024, 10:40 PM IST

Jana Sena leader Pawan Kalyan
Jana Sena leader Pawan Kalyan

Jana Sena leader Pawan Kalyan: రోడ్లు బాగుచేయడు, త్రాగునీరు, సాగునీరు ఇవ్వని ఇలాంటి సీఎం మనకు అవసరమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంతో పాటుగా పలు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు.

Jana Sena leader Pawan Kalyan: వైసీపీ ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా.. జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. జగన్‌ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారని చెప్పారు.

జనసేన అధినేత , పిఠాపురం శాసనసభ అభ్యర్థి పవన్ గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో తన నివాసం నుంచి మొదలైన రోడ్ షో చెందుర్తి తాటిపర్తి కూడలి మీదుగా పిఠాపురం లోని పి దంతుమూరు ప్రవేశించింది. వెందుర్తి , తిమ్మాపురం జంక్షన్ కొత్తూరు రోడ్టు మీదుగా గోకువాడ , నర్సింగపురం, లక్ష్మీ నర్సాపురం, విరవాడ గ్రామాల్లో లో ప్రజలు , కూటమి నేతలు పవన్ కల్యాణ కు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. విరవ మంగుతుర్తి పవన్ రోడ్‌షో చేరుకోగానే పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు గ్రామంలోకి రావాలని కోరగా ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ గుండానే పోలీసుల నుంచి అనుమతి ఉందని సర్దిచెప్పి విరవలో ముగించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని జగన్ కాజేస్తారని పవన్ లక్ష్మీ నర్సాపురం రోడ్ షో లో హెచ్చరించారు. పట్టాదారు పాస్ పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ రాజముద్రకు బదులు జగన్ ఫోటో ఉండటం పై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైఎస్సార్సీపీకి ఓటమి ఖాయం - కూటమిదే అధికారం : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Election campaign

మన ఆస్తులపై జగన్ పెత్తనమేంటని ఆ హక్కు ఎక్కడదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్, మద్యం వ్యాపారం చేస్తూ 40 రూపాయల బాటిల్ 200 వందలకు అమ్మి ఐదేళ్లలో 40 వేల కోట్లు జేబులో వేసుకున్నాడని ప్రజలకు చెప్పారు. చంద్రబాబు పోలవరం 70 శాతంపైగా పూర్తి చేస్తే జగన్ ఆపేశాడన్నారు. రోడ్లు బాగుచేయడు, త్రాగునీరు, సాగునీరు ఇవ్వని జగన్ అవసరమా అని అన్నారు. అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి 30 కేసుల్లో ముద్దాయిగా 16 నెలలు జైలు కేళ్లి వచ్చి బెయిల్ పై తిరుగుతున్న వ్యక్తి జగన్ అని ప్రజలకు పవన్ చెప్పారు. సుదీర్ఘ కాలం సిఎం గా పనిచేసిన చంద్రబాబు , కేంద్రంలో భాజపా లాంటి బలమైన పార్టీతో కూటమిగా మీ ముందుకు వస్తున్నాం గెలిపించాలని కోరారు.

మన సమాజంలో గురువులకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. అలాంటి గురువులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. మద్యం షాపుల వద్ద కాపలా కాయించారు. ఒక ఉద్యోగిగా చెబుతున్నా, అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే సీపీఎస్‌కు పరిష్కారం చూపిస్తా. వైసీపీ గూండాలకు చెబుతున్నా, మా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను. తెగించి కూర్చున్నా.. తాటాకు చప్పుళ్లకు భయపడను. అప్పటికి వినకపోతే ప్రభుత్వం వచ్చాక వారి తాట తీసి రోడ్లపై తిప్పిస్తా. జగన్‌ ఫ్యాన్‌కి సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు.


తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే: పవన్​ కల్యాణ్​ - Pawan kalyan Election Campaign

ల్యాండ్ టైటిల్ యాక్ట్​తో జగన్ ప్రజల ఆస్తుల్ని కాజేస్తారు: పవన్ కల్యాణ్
Last Updated :Apr 29, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.