ETV Bharat / state

యూపీఎస్సీ ఫలితాల్లో నలుగురు ట్వంటీఫస్ట్ అకాడమీ విద్యార్థులకు ర్యాంకులు - UPSC Results

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 6:40 PM IST

IAS Academy Mentor Bhavani Shankar About UPSC Results : సివిల్స్‌- 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాలు మంగళవారం విడుదల కాగా, ఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారిలో నలుగురు విద్యార్థులు కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందినవారున్నారు. సంస్థ చీఫ్ మెంటార్ డాక్టర్ సీహెచ్ భవానీశంకర్ ఈ విషయాన్ని తెలిపారు.

UPSC Civils Results 2024
IAS Academy Bhavani Shankar About UPSC Results

IAS Academy Mentor Bhavani Shankar About UPSC Results : ఎంతో కఠినమైన సివిల్స్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది యూపీఎస్సీ ర్యాంకులు సాధించిన వారిలో న‌లుగురు కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందినవారు ఉన్నారని ఆ సంస్థ చీఫ్ మెంటార్ డాక్టర్ సీహెచ్ భవానీశంకర్ తెలిపారు. షాహి దర్శిని 112వ ర్యాంక్, నల్గొండ జిల్లాకు చెందిన ధీరజ్ రెడ్డి 173వ ర్యాంక్, స‌మీక్ష ఝా 362వ ర్యాంక్, నాగ సంతోష్ అనూష 818వ ర్యాంకులను సాధించారని చెప్పారు.

మెయిన్స్, ఇంటర్వ్యూలకు పర్సనల్ మెంటార్ షిప్ కూడా తీసుకుని విజయం సాధించారన్నారు. కేపీఐఏఎస్​గా ప్రసిద్ధి చెందిన ఈ అకాడమీలోని దిల్లీ, హైదరాబాద్ బ్రాంచ్​లలో కొన్ని వందల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా శిక్షణ పొందారని చెప్పారు. అనేక మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసులకు పంపడంలో 20 సంవత్సరాల ప్రస్థానం గల కృష్ణ ప్రదీప్ కృతకృత్యులయ్యారు.

యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - UPSC final Results 2023

UPSC Results 2024 : దిల్లీలోని కేపీఐఏఎస్ శిక్షణ కేంద్రంలో దాదాపు 500 మంది వరకు ఇంటర్వ్యూలకు శిక్షణ పొందారు. 275 మార్కులున్న ఈ ఇంటర్వ్యూకు కృష్ణ ప్రదీప్​తో పాటు చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీశంకర్ వ్యక్తిగత పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. తెలుగు సంస్థ అయిన కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం గర్వించదగ్గ విషయం. మొదటి ర్యాంకర్ అయిన ఆదిత్య శ్రీవాస్తవను కృష్ణ ప్రదీప్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారని ఆ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ర్యాంకులు పొందినవారందరినీ అభినందిస్తున్నట్లు చెప్పారు.

Civils Ranker Dheeraj Reddy about Preparation : గత ఐదు సంవత్సరాలుగా సన్నద్ధతమవుతున్నానని, సివిల్స్ ప్రిపరేషన్​ నిరంతరం సాగుతూ ఉంటుందని 173వ ర్యాంక్ సాధించిన ధీరజ్​ రెడ్డి చెప్పారు. ఒకసారి రాస్తే వచ్చే అనుభవంతో సివిల్స్​ ఎలా సన్నద్ధమవ్వాలో తెలుస్తుందన్నారు. గ్రాడ్యుయేషన్​ టైంలోనే సివిల్స్​ మార్గాన్ని ఎంచుకున్నానని, తండ్రిని ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. లైఫ్​లో ఏం చేయలన్నా మన మీద మనకు నమ్మకం ఉండాలని, దాని కోసం ధైర్యంగా ఉండాలని చెప్పారు.

సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ మార్గాన్ని ఎంచుకున్న : ​173వ ర్యాంకర్​ ధీరజ్ రెడ్డి - 173rd Ranker Dheeraj Interview

నడవలేని స్థితి అయినా కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్‌ సాధించా : 887వ ర్యాంకర్ హనిత - Interview with UPSC Ranker Hanitha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.