ETV Bharat / state

షెల్టర్‌ జోన్లు లేక అనాథల ఆర్తనాదాలు - ఆశ్రయం కల్పించాలంటూ నిరాశ్రయుల వేడుకోలు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 12:13 PM IST

Homeless Shelter Centre Problems in Mahabubnagar
Homeless Shelter Centre Problems in Mahabubnagar

Homeless Shelter Centre Problems in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 19 పురపాలికలు ఉంటే కేవలం మహబూబ్‌నగర్‌లో మాత్రమే షెల్టర్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. దీంతో పురపాలిక కేంద్రాల్లో అనాథలు నానా తిప్పలు పడుతున్నారు. షెల్టర్ జోన్లు లేక వేసవిలో ఎండలకు తట్టుకోలేక చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి షెల్టర్‌ జోన్లు ఏర్పాటు చేసి ఆదుకోవాలని నిరాశ్రయులు కోరుతున్నారు.

మహబూబ్‌నగర్​లో షెల్టర్‌ జోన్లు లేక అనాథల ఆర్తనాదాలు

Homeless Shelter Centre Problems in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలిక కేంద్రాల్లో అనాథలు నానా తిప్పలు పడుతున్నారు. నా అనుకునే వారు లేకపోయినా, బతకడానికి స్థలం లేక రోడ్లపై సేదతీరుతున్నారు. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసే షెల్టర్‌ జోన్ల కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి, ప్రతిపాదనలు పంపాలని సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసినా, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. షెల్టర్‌ జోన్లు లేక అనాథలు, నిరాశ్రయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 19 పురపాలికలు ఉంటే, నిరాశ్రయుల కోసం కేవలం మహబూబ్‌నగర్‌లో మాత్రమే షెల్టర్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా అవి కూడా మూతపడడంతో అనాథలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు, వానలకు, చలికి తట్టుకోలేక పదుల సంఖ్యలో అనాథలు మృతి చెందుతున్నారు. రైల్వే స్టేషన్‌ సదుపాయం ఉన్న మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, గద్వాల పట్టణాల్లో నిరాశ్రయులు ఎక్కువగా ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రైల్వే స్టేషన్‌ సమీపంలోనే తచ్చాడుతూ జీవనం సాగిస్తున్నారు.

Food distribution: అనాధ పిల్లలకు ఆహారం పంపిణీ

"2014లో పైలట్ ప్రాజెక్ట్ కింద అనాథల కోసం షెల్టర్‌ స్కీమ్​ను విడుదల చేయడం జరిగింది. అయితే ఇది మున్సిపల్ వారికి అప్పజెప్పటంతో మున్సిపల్, మెప్మా వీరిద్దరి సమక్షంలో దీన్ని నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఎవరైతే నిరాశ్రయులు, ఇళ్లులేని వారు ఉంటారో, వేరే దగ్గర నుంచి ఇక్కడ ఉపాధి హామీ కూలీ పనుల కోసం వచ్చే వారి కోసం మూడు నెలలు ఉండటానికి ఈ షెల్టర్ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల క్రితం చిన్న పిల్లను ఎవరో కిడ్నాప్ చేయడంతో పోలీసుల ఆదేశాల మేరకు ఈ షెల్టర్​లోకి రానివ్వట్లేదు." -రాజేందర్‌ నాయక్‌, ఆశ్రమ నిర్వాహకుడు

Homeless Shelter Centre Problems : మున్సిపాలిటీల్లో నిరాశ్రయుల కోసం షెల్టరు జోన్లు ఏర్పాటుచేయాలని 2014లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణాల్లో ఎక్కడైనా నిరాశ్రయులు ఉంటే గుర్తించి ఆశ్రయంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలని తెలిపింది. కానీ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌ మినహా ఏ పురపాలికల్లో ఆ నిబంధనలు అమలు కావట్లేదు. మహబూబ్‌నగర్‌గర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని నిరాశ్రయుల కేంద్రం నామమాత్రంగానే పనిచేస్తోంది. ఇటీవల ఆస్పత్రిలో ఓచిన్నారి అపహరణకు గురికావడంతో అక్కడకి ఎవరినీ రానివ్వకపోవడం వల్ల నిరాశ్రయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ భవనంలో అనాథల కోసం షెల్టర్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇక్కడే అధికంగా ఉండటంతో మెప్మా ఆధ్వర్యంలో ఆలనాపాలనా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అది కాస్త మూసివేయడంతో పెద్ద మొత్తంలో నిరాశ్రయులు రోడ్ల వెంట సేదతీరుతున్నారు. పట్టణాల్లో ఎక్కడైనా నిరాశ్రయిలుంటే గుర్తించి షెల్టర్‌ జోన్‌లో ఆశ్రయం కల్పించాలని ఆశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరాశ్రయుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

కనిపెంచిన అమ్మకే అమ్మయ్యాడు.. 20 ఏళ్లుగా సేవలు

ఆశ్రమానికి యాచకులు, అనాథ వృద్ధుల తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.