ETV Bharat / state

మాకు ఓటేయకుంటే చచ్చిపోతామని అభ్యర్థులు బెదిరించడం తగదు : గవర్నర్ తమిళిసై

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 2:12 PM IST

Updated : Jan 25, 2024, 2:19 PM IST

Governor Tamilisai At 14th National Voters Day Celebrations
National Voters Day Celebrations At JNTU

Governor Tamilisai On Voters Day 2024 : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కొంత మంది నేతలు తమకు ఓటు వేయకుంటే చనిపోతామని బెదిరించారని, అలాంటి సంఘటనలు ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి సూచించారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : గవర్నర్ తమిళిసై

Governor Tamilisai On Voters Day 2024 : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని జేఎన్​టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తమకు ఓటు వేయకుంటే చనిపోతానని కొందరు నాయకులు బెదిరించారని అలాంటి విషయాలను ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి సూచించారు.

National Voters Day Celebrations At JNTU : ఓటు వేసేటప్పుడు అభ్యర్థులను పూర్తిస్థాయిలో విశ్లేషించి, మంచి వారిని ఎన్నుకోవాలని యువతకు గవర్నర్ సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన సెలవును విహార యాత్రలకు వెళ్లేందుకు ఉపయోగించడం బాధాకరం అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పకడ్బందీగా ఓటింగ్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 46% ఓటు నమోదు అవ్వడం బాధాకరమని అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

14th National Voters Day Celebrations in Hyderabad : అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడమే పౌరుల ప్రథమ బాధ్యత కావాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సీఈఓ వికాస్ రాజ్​తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ శరత్

"ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమే. విహార యాత్రలు వెళ్లేందుకు కాదు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఎలాగైతే ఉంటారో. ఓటు కోసం కూడా లైన్‌లో వేచి ఉండాలి. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలి. తనకు ఓటు వేయకుంటే చనిపోతాం అని ఓ అభ్యర్థి చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి." -గవర్నర్‌, తమిళిసై

ఇల్లందులో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

National Voter’s Day In Yadadri : జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓటరు అవగహన ర్యాలీ నీ జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగి జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పట్టణం లోని ప్రధాన రహదారి మీదుగా కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా అధికారులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు మన హక్కు అని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటు వజ్రాయుధం'

నేషనల్ ఓటర్స్ డే 2024- ఈ సారి థీమ్ ఏంటంటే?

Last Updated :Jan 25, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.