ETV Bharat / state

టీడీపీ కొత్త వ్యూహం - మంత్రి బొత్సపై పోటీకి మాజీ మంత్రి గంటా !

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 7:49 AM IST

ex_minister_ganta_vs_minister_botsa
ex_minister_ganta_vs_minister_botsa

EX Minister Ganta Vs Minister Botsa: చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సపై ధీటైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు తెలుగుదేశం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో బొత్సపై పోటీగా గంటా శ్రీనివాసరావే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం భావిస్తోంది. దీనిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

Minister Botsa Vs EX Minister Ganta : ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీ సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది.

చీపురుపల్లి నుంచి శాసనసభకు 4 సార్లు పోటీ చేసిన బొత్స, 3 సార్లు విజయం సాధించారు. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఆయన పోటీ దాదాపు ఖాయమైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చోడవరం నుంచి విజయం సాధించారు. 2009లో అనకాపల్లి నియోజవర్గం నుంచి, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం ఉత్తరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.

మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం- దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ ఆందోళన

కంచుకోటలో పాగా వేసే దిశగా: చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపడం ద్వారా మంత్రి బొత్సను ఓడించాలని టీడీపీ అధిష్ఠానం ఆలోచించింది. గంటా అయితే బలమైన అభ్యర్థి అవుతారని, టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంటుందని సర్వేల్లోనూ తేలినట్లు సమాచారం. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న చీపురుపల్లిలో మళ్లీ పాగా వేసేలా తెలుగుదేశం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ అవిర్భావం నుంచి 1999 వరకు అంటే దాదాపు 16 సంవత్సరాలు తెలుగుదేశానికి ఎదురేలేదు. 1983 ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 9 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2004, 2009 సంవత్సరాల్లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున పోటీ చేసి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కిమిడి మృణాళిని పోటీ చేసి 20 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు.

అవినీతికి పాల్పడితే ఓటు వేయకండి - మంత్రి బొత్స అసక్తికర వ్యాఖ్య

తాజా Vs మాజీ విద్యాశాఖ మంత్రి: 2014 ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్​ తరపున పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో వైఎస్సార్​సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా రానున్న ఎన్నికల్లో బొత్స, గంటా తలపడితే, తాజా, మాజీ విద్యాశాఖ మంత్రుల పోరుకు ఈ నియోజకవర్గం వేదిక అవుతుంది.

మళ్లీ మా ప్రభుత్వం వస్తే డిమాండ్లు నెరవేరుస్తాం - అడ్డుకున్న అంగన్వాడీలతో మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.