అవినీతికి పాల్పడితే ఓటు వేయకండి - మంత్రి బొత్స అసక్తికర వ్యాఖ్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 9:10 PM IST

thumbnail

Minster Botsa Satyanarayana: రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఒక్కసారిగా అలా మాట్లాడిన మాటలకు సభ ప్రాగంణంలోని ప్రజలందరూ అవాక్కయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వైఎస్సార్​ ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు, వైఎస్సార్​సీపీకి చెందిన జిల్లా ఇతర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారికి ఓటేయకండి అని మంత్రి బొత్స ప్రజలకు సూచించారు. అసలు అవినీతికి పాల్పడిన వారికి ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. కొన్ని వార్త ఛానాళ్లు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంతో పాటు, నేతలపై, ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 
 

"ఎవరైనా అవినీతి చేసినా, మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మేము అవినీతి చేసినప్పుడు ఓటు ఎందుకు వేయాలి. మేము తప్పు చేసినప్పుడు ఓటు ఎందుకు వేయాలి. ఓటు వేయాల్సిన అవసరం లేదు." - బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.