ప్రకృతిపై మమకారంతో ఐఎఫ్​ఎస్​కు ఎంపిక- ఆలిండియా 83వ ర్యాంకుతో సత్తా చాటిన యువకుడు - IFS Top Ranker Krishna Chaitanya

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 5:05 PM IST

thumbnail
ప్రకృతిపై మమకారంతో ఐఎఫ్​ఎస్ ఎంపిక- ఆలిండియా 83వ ర్యాంకుతో సత్తా చాటిన యువకుడు (ETV Bharat)

IFS Top Ranker Krishna Chaitanya Success Story: మనసుకు నచ్చిన పని చేస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఒక్కోసారి లక్షల జీతాలు వచ్చే ఉద్యోగం చేసినా సంతృప్తి ఉండదు. ఏదో తెలియని వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని కాస్త ముందుగానే గ్రహించాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణచైతన్య అనే యువకుడు. చిన్నప్పుడు తనకు ఆహ్లాదాన్ని పంచిన ప్రకృతిపై మమకారం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రకృతికి దగ్గరవ్వాలని ఇండియన్ ఫారెస్ట్​ సర్వీస్​ను ఎంచుకున్నాడు. 

ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 83వ ర్యాంకుతో సత్తాచాటాడు. స్పష్టమైన గోల్​ను ఏర్పాటు చేసుకుని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే సివిల్స్​లో విజయం సాధించడం చాలా సులువని ఈ యువకుడు అంటున్నాడు. ఈ దిశగా నేటి తరం యువత కృషి చేయాలని సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సూచించారు. ఈ నేపథ్యంలో తన లక్ష్య సాధనకు కృష్ణచైతన్య చేసిన కృషేంటి? ఈ విజయం ఆయన్ను ఎలా వరించింది? వంటి విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.