ETV Bharat / state

వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు రేపటిలోగా పరిహారం - నేరుగా రైతుల ఖాతాల్లో జమ - EC permits crop damage money in TS

author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 8:00 PM IST

Updated : May 6, 2024, 6:57 AM IST

Crop Damage Compensation in Telangana
Crop Damage Compensation in Telangana (etv bharat)

Crop Damage Compensation in Telangana : యాసంగిలో వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు ఈసీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు పరిహారం మొత్తాన్ని చెల్లించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంగళవారం లోగా రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి.

EC Permits Payment of Crop Damage Compensation : రాష్ట్రంలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ యాసంగి సీజన్‌లో మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు వడగండ్ల వాన కురిసింది. ఈ ప్రభావంతో పది జిల్లాల్లో 15,814 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.15.81 కోట్లను పరిహారం కింద రైతులకు చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.

అయితే రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరింది. అందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ నేరుగా రైతుల అకౌంట్లలోకే మంగళవారం లోపు నగదు జమ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం సంభవించిన నెలన్నర రోజుల వ్యవధిలోనే పరిహారం అందించడం కర్షకులకు పెద్ద ఉపశమనంలా చెప్పవచ్చు.

రైతు బంధు నాలుగైదు రోజుల్లో వేస్తాం : రైతులకు పరిహారం విషయాన్ని శనివారమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాగే రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు. పరిహార డబ్బులను అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామన్నారు.

మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు సిద్ధం : మరోవైపు మొక్కజొన్న రైతులకు రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జొన్న కొనుగోలుకు సర్కార్ సిద్ధమైంది. ఆదిలాబాద్​, నిజామాబాద్​ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్నను కొనేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లు జరగనున్నాయి. ఇప్పటికే మొక్కజొన్నకు క్వింటాల్​కు మద్దతు ధర రూ.3,180 చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.

పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - నిధుల విడుదలకు సిద్ధమన్న మంత్రి తుమ్మల - crop damage in telangana

అకాల వర్షాలతో అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు - CROP DAMAGE in Telangana

Last Updated :May 6, 2024, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.