ETV Bharat / state

అవయవదానాల్లో తెలంగాణ @ నంబర్​ వన్ - ఎక్స్​లెన్స్​ అవార్డు సొంతం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 12:13 PM IST

Donate Organs in Telangana 2024 : అవయవదానంలో రాష్ట్రం మరోమారు ముందు వరుసలో నిలిచింది. 2023 సంవత్సరంలో అత్యధికంగా 728 ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశంలోనే అవయవదానాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనేజేషన్ ప్రకటించింది. ఇక ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆర్గాన్ డొనేషన్ కాంగ్రెస్​లో తెలంగాణ అవయవదానాలకు సంబంధించి ఎక్స్​లెన్స్ అవార్డును సైతం అందుకుంది.

Donate Organs in Telangana 2024
Live Organ Donations in Telangana

అవయవదానాల్లో తెలంగాణ @ 1 సొంతం చేసుకున్న ఎక్స్​లెన్స్​ అవార్డు

Donate Organs in Telangana 2024 : దాదాపు దశాబ్దకాలంగా చేసిన కృషి, రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య పెరుగుదలకు దారి తీసింది. ఏడాది కాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అవయవదానాలు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2013లో జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఆ సంవత్సరం కేవలం 189 ఆర్గాన్ డొనేషన్లు మాత్రమే జరిగాయి. అందులోనూ అత్యధిక శాతం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్​లే కాగా, కేవలం 3 ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే 2023లో మాత్రం రికార్డు స్థాయిలో ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్టు జీవన్ దాన్ గణాంకాలు(Jeevan Dan Statistics 2024) చెబుతున్నాయి.

రెండేళ్ల బాలిక బ్రెయిన్​ డెడ్- అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ

Organs Donate First Place in INDIA 2024 : గతేడాది ఏకంగా 728 ఆర్గాన్ డొనేషన్లు జరగగా అందులో అత్యధికంగా 287 మూత్రపిండాలు, 75 ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్టు జీవన్ దాన్ నివేదికలు(Jeevan Daan Reports 2024) స్పష్టం చేస్తున్నాయి. 2016 నుంచి రాష్ట్రంలో క్రమంగా అవయవ దానాల పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2021లో 616, 2022లో 716 అవయవ దానాలు జరగటం విశేషం. ఆర్గాన్ డొనేషన్లలో తెలంగాణ ముందు వరుసలో ఉందని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ నొట్టో(Notto) సైతం ప్రకటించింది. ఇక ఇటీవల దుబాయ్‌లో జరిగిన యూఏఈ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ ప్లాంట్ కాంగ్రెస్ 2024లో రాష్ట్రానికి ఎక్స్ లెన్స్ అవార్డు దక్కింది.

భర్త బ్రెయిన్ ​డెడ్​- అవయవదానం చేసి మంచి మనసు చాటుకున్న భార్య, నలుగురి ప్రాణాలు సేఫ్​!

Live Organ Donations in Telangana : అయితే ఆర్గాన్ డొనేషన్ల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ ఇప్పటికీ సరైన సమయానికి అవయవాలు దొరకక అనేక మంది ప్రాణాలు వదులుతుండటం బాధాకరం. ఆర్గాన్ డొనేషన్లలో కాలేయం, మూత్రపిండాల లాంటి అవయవాలు ఎక్కువగా లైవ్ డోనర్లతో జరుగుతున్నాయని జీవన్ దాన్ ఇన్ ఛార్జి స్వర్ణలత పేర్కొన్నారు. ఇక లైవ్ డొనేషన్ల విషయానికి వస్తే ఎక్కువగా స్త్రీలే అవయవదాతలుగా ఉన్నారు.

"రాష్ట్రంలో జీవన్​ దాన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. 2022 అవయదానాల సంఖ్య 200 దాటింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఇది ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఆన్​లైన్ వెబ్​సైట్​ ద్వాారా మరింత వేగంగా చేరుకోగల్గుతున్నాం." - డాక్టర్‌ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇంఛార్జ్‌

'ప్రాణం' కోసం పాదయాత్ర- రక్తదానంపై ప్రచారం చేస్తూ 17వేల కి.మీ నడక

Mostly Organs Donations Are Womens : దేశవ్యాప్తంగా జరుగుతున్న లైవ్ డొనేషన్లలో 80 శాతం మంది స్త్రీలే ఉంటున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అవయవదానంపై ఉన్న అపోహలు ఇప్పటికీ ఆటంకంగా నిలుస్తున్నాయని స్వర్ణలత అభిప్రాయపడ్డారు. చనిపోయే ఒక్కరు మరో 8 మంది రూపంలో చిరంజీవులు అవుతారని జీవన్ దాన్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. క్లిష్ట సమయాల్లో బాధితుల కుటుంబ సభ్యులు సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలరని చెబుతున్నారు.

తోటి శునకానికి రక్తదానం- రాకీ ప్రాణాలు కాపాడిన సిరి! ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.