ETV Bharat / bharat

5 వేల మంది మహిళల అవయవదానం.. స్వాతంత్ర్య దినోత్సవం రోజే..

author img

By

Published : Jun 19, 2023, 11:07 PM IST

Updated : Jun 20, 2023, 6:41 AM IST

Organ Donation In Kerala : కేరళలోని ఓ గ్రామానికి చెందిన 5000 మంది మహిళలు అవయవదానానికి సిద్ధమయ్యారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంగీకార పత్రాలు అధికారులకు అందించనున్నట్లు మహిళలు తెలిపారు.

organ donation in kerala
5000 మంది మహిళల అవయవదానం

Organ Donation In Kerala : కేరళ కోజికోడ్​లోని​ కొట్టూర్ గ్రామానికి చెందిన మహిళలు.. స్ఫూర్తివంతమైన ముందడుగు వేశారు. మరణాంతరం తమ అవయవాలు ఇతరులకు ఉపయోగపడేలా చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానానికి అంగీకారం తెలిపారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంబంధిత అధికారులకు.. అంగీకార పత్రాలు సమర్పించనున్నట్లు సదరు మహిళలు తెలిపారు. కాగా ఈ మహత్తర కార్యక్రమానికి కొట్టూర్ గ్రామం కుటుంబశ్రీ కమ్యునిటీ డెవలప్​మెంట్​ సొసైటీ ఈ శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సంస్థే కుటుంబశ్రీ. ఒక్కో కుటుంబశ్రీ యూనిట్​లో 20 మంది మహిళలు సభ్యులుగా ఉంటారు. ఇందులో భాగంగా కొట్టూర్ కుటుంబశ్రీ కమ్యునిటీ డెవలప్​మెంట్​ సొసైటీ (సీడీఎస్​) ఆధ్వర్యంలో మొదటి దశలో సీడీఎస్ సభ్యులకు స్థానిక ఎల్​పీ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. గ్రామాన్ని సంపూర్ణ అవయవదాన పంచాయతీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

organ donation in kerala
5000 మంది మహిళల అవయవదానం

సీడీఎస్ ఛైర్​పర్సన్​ షీనా యూఎం​, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సీహెచ్ సురేశ్, కో ఆర్డినేటర్​ సీకే వినోదన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. కుటుంబశ్రీ 25వ వార్షికోత్సవం సందర్భంగా, పంచాయతీ అధికారుల సహాయంతో 19 వార్డుల్లో కో ఆర్డినేటర్​లను నియమించి ప్రచారం విస్తృతం చేస్తున్నారు. జూన్ 25 నుంచి జూలై 5 వరకు కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

కుటుంబశ్రీ సభ్యులే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్​ను కూడా ఇందులో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నామని సీడీఎస్ ఛైర్​పర్సన్ షీనా పేర్కొన్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభించిన ​కుటుంబశ్రీ సంస్థకు.. ఆయా గ్రామ పంచాయతీల్లో విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. కుటుంబశ్రీ కమ్యూనిటీలో మహిళలే కాకుండా పురుషులను కూడా చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

అవయవదానం చేసి ఏడుగురి ప్రాణాలను కాపాడిన వ్యక్తి...
బంగాల్​లోని కోల్​కతాలో బ్రెయిన్​ డెడ్​తో మరణించిన వ్యక్తి.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. మరణించిన వ్యక్తి అవయవాలను ఆయన కుటుంబసభ్యులు దానం చేశారు. దీంతో వైద్యులు.. ఏడుగురి ప్రాణాలను కాపాడారు.

అసలేం జరిగిందంటే..
పూర్బ బర్ద్వాన్​లోని హత్​గోబింద్​పుర్​లో నివసిస్తున్న హిరణ్​మోయ్ ఘోషల్(54) నాటకీయరంగంలో సుప్రసిద్ధుడు. ఆయన బుధవారం మధ్యాహ్నం డైనింగ్​ హాల్​లో అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్​ చేసి ఆయన మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. అనంతరం అతడి పరిస్థితి విషమించడం వల్ల మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఘోషల్‌కు శస్త్ర చికిత్స చేసే పరిస్థితి లేనందున లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ పెట్టారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే కింది లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated :Jun 20, 2023, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.