ETV Bharat / state

సీఎం రేవంత్‌ రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది - ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు : పంచాంగ కర్త - Congress Ugadi Celebrations in TS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 7:53 PM IST

Congress Ugadi Celebrations at Gandhi Bhavan : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని పంచాంగ కర్త చిలుకూరి శ్రీనివాస మూర్తి వెల్లడించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రోధి నామ సంవత్సరంలో రేవంత్‌ రెడ్డి వేగంగా పని చేస్తారని, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని తెలిపారు.

ugadi festival celebrations in telangana
Congress Ugadi Celebrations at Gandhi Bhavan

Congress Ugadi Celebrations at Gandhi Bhavan : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భవిష్యత్తు అత్యంత అమోగంగా ఉందని, ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరని పంతులు చిలుకూరి శ్రీనివాస మూర్తి పేర్కొన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, ఆ తరువాత జరిగిన పంచాంగ శ్రవణంలో శ్రీనివాస మూర్తి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు, పార్లమెంటు ఎన్నికల (Parliament Elections) ఫలితాలు, సీఎం రేవంత్‌ రెడ్డి భవితవ్యం తదితర అంశాలను విశ్లేషించారు.

ఈ పంచాంగ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్​ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు (Govt Adviser) హర్కర్ వేణుగోపాల్, సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు, నిరంజన్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌసిక్‌ యాదవ్‌, పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి అప్పటి సర్కార్​ను ముచ్చెమటలు పట్టించారని, ఇప్పుడు ఆయన పరశురాముడు మాదిరి పని చేస్తారని వ్యాఖ్యానించారు.

జోరుగా ఉగాది సంబురాలు - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎడ్ల బండ్ల పోటీలు - Bullock Cart Race

క్రోధి నామ సంవత్సరంలో మరింత వేగంగా పని చేస్తారన్న ఆయన, రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక, అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అంతా సహకరించాలని, సీఎం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, తిరుగుండదని స్పష్టం చేశారు. సింహానికి ఆకలేస్తే ఎలా ఉంటుందో, అచ్చం అలాగే సీఎం రేవంత్‌ రెడ్డి ఉంటారన్నారు. రాహుల్ ​గాంధీ (Congress Leader Rahul Gandhi) యోగం కూడా బాగుందని, ఆయన నేతృత్వంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నా, మనదే పైచేయి అవుతుందని వివరించారు.

మరోవైపు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ (PCC Working President) మహేశ్​ కుమార్‌ గౌడ్‌ కొనియాడారు. వంద రోజుల్లో ప్రజల మన్ననలు పొందారని, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆయన జోస్యం చెప్పారు.

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు - Ugadi Fest at Swarna Bharat Trust

తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి - ఉగాది వేళ కళకళలాడుతున్న మార్కెట్లు - Ugadi Festival Celebrations 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.