ETV Bharat / state

పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ దృష్టి - గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధుల కోసం వేట

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 8:44 PM IST

Etv Bharat
Etv Bharat

Congress Strategy on Lok Sabha Elections : పార్లమెంట్‌ఎన్నికల్లో గెలిచే సత్తా కలిగిన అభ్యర్ధుల కోసం కాంగ్రెస్ ముమ్మర వేటసాగిస్తోంది. ఒక్కొస్థానానికి ఇద్దరు నుంచి నలుగురు టికెట్‌ ఆశిస్తుండటంతో గెలుపుగుర్రాల ఎంపికపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అంతర్గతంగా బలమైన నాయకులు లేనిచోట ఇతరపార్టీల నుంచి తీసుకోవాలని యోచిస్తున్నట్లు పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌ - గెలిచే సత్తా కలిగిన అభ్యర్ధుల కోసం ముమ్మర వేట

Congress Strategy on Lok Sabha Elections : పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీబలోపేతంతోపాటు అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఉమ్మడి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ బలబలాలపై జిల్లా, ఇంఛార్జీమంత్రులతో ఆరాతీశారు. ఈనెల 26 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బూత్‌స్థాయిలోని ఏజెంట్లు కీలకంగా వ్యవహరించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్న భావన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వారి సేవలను సమర్ధంగా వినియోగించుకునేలా నాయకత్వం ప్రణాళికలు సిద్దంచేస్తోంది. అందులో భాగంగా గురువారం బూత్‌స్థాయి ఏజెంట్లతో ఎల్బీస్టేడియంలో ఏఐసీసీ (AICC President) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ రాష్ట్రనాయకత్వం వేట సాగిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో ఇద్దరు నుంచి నలుగురు టికెట్‌ ఆశిస్తున్నారు. వరంగల్‌ స్థానం ఎస్సీకి రిజర్వ్‌ అయినందున అద్దంకి దయాకర్‌ని బరిలో దింపే యోచనలో ఉండగా మరో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టికెట్‌ ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీకి సంపత్‌కుమార్, మల్లురవితోపాటు చారకొండ వెంకటేశ్‌ చొరవచూపుతున్నారు. ఎస్టీ రిజర్ట్‌ స్థానాలైన ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్​ మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మాజీ పోలీస్‌అధికారి కాశీరాంనాయక్‌ టికెట్ ఆశిస్తున్నారు.

'కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్​ ఇచ్చిన ఆప్​, టీఎంసీ

Sonia Gandhi in MP Election at Khammam : ఖమ్మం నుంచి పోటీకి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi)చొరవ చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆమె రాకపోతే రేణుకాచౌదరి, వీహెచ్​, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫిరోజ్‌ఖాన్, అజహరుద్దీన్‌(Azaruddin)తో పాటు పొత్తులో భాగంగా ఎంబీటీకి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్‌వార్‌ రూమ్‌లో కీలకంగా పనిచేసిన సంతోష్‌రుద్ర మహిళ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద టికెట్‌ ఆశిస్తున్నారు.

పెద్దపల్లి టికెట్‌ గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఇవ్వాలని కోరుతున్నారు. నిజామాబాద్ నుంచి ఈరవత్రి అనిల్, కరీంనగర్‌ లేదా నిజామాబాద్‌ బరిలోకి దిగే అవకాశం ఉందని స్వయంగా జీవన్‌రెడ్డి చెబుతున్నారు. ఆ స్థానాన్ని ఆరంజ్‌ ట్రావెల్స్‌అధినేత సునీల్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజ్‌ ఆశిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మెదక్‌ నుంచి జగ్గారెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష లేదా జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Lok Sabha Elections 2024 : జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్, మంత్రి రాజనర్సింహ కుమార్తె త్రిష టికెట్‌ ఆశిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి హరివర్దన్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు బరిలో దిగాలని యోచిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి యువజన కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్, రోహిణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ వేణుగోపాల్ స్వామి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. చేవెళ్ల నుంచి పారిజాత నర్సింహారెడ్డి, మాజీఎమ్మెల్యే కేఎల్​ఆర్​(KLR) పోటీ పడుతున్నారు.

మహబూబ్‌నగర్ నుంచి ఎంఎస్​ఎన్​ (MSN Pharma) ఫార్మా అధినేత జీవన్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, సీతాదయాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, పున్నా కైలాష్ నేతలతోపాటు కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి కుమారుడు డాక్టర్‌ పవన్‌ కుమార్‌ రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్‌ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం

మరో ఏక్​నాథ్​ షిండేగా రేవంత్​ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.