ETV Bharat / state

త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 8:50 AM IST

Coal Mines Auction 2024 : తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకోవడంపై సింగరేణి దృష్టి పెట్టింది. తాజాగా కేంద్ర బొగ్గుశాఖ కొత్త గనులను వేలం వేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది.

central on Coal Blocks Auction
central on Coal Blocks Auction

Coal Mines Auction 2024 : రాష్ట్రంలో నూతన బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో రెండు బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గుశాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆపై గనుల వేలం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని సింగరేణి కసరత్తు చేస్తోంది.

Coal Mines Bidding in Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 2.40 లక్షల టన్నుల వరకు బొగ్గు కావాలని సింగరేణిని అడుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో (Jaipur Thermal Power Plant)సింగరేణికి ఇప్పటికే 1200 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి టెండర్లు పిలుస్తోంది. దీంతోపాటు 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సూచనలు చేసింది. నాలుగు సంవత్సరాల్లో పూర్తయ్యే ఈ రెండు ప్లాంట్లకు రోజూ 20,000ల టన్నుల బొగ్గు అవసరం.

యాదాద్రి థర్మల్​ పవర్​ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి

Singareni To Buy Coal Mines in Auction : ఇవే కాకుండా రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బొగ్గు సరఫరాకు సింగరేణి తంటాలు పడుతోంది. అక్కడే ఎన్టీపీసీ అదనంగా మరో 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. ఇవి పూర్తయితే రోజుకు మరో 30,000ల టన్నుల బొగ్గు సింగరేణి సరఫరా చేయాలి. ఇప్పుడున్న పాత గనుల్లో రోజువారీ ఉత్పత్తవుతున్న 2.20 లక్షల టన్నులే సరిపోవడం లేదు. మరోవైపు 20,000ల టన్నుల అమ్మకాలను సింగరేణి (Singareni in Coal Mines Auction) నష్టపోతోంది.

ఇక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తయితే రోజూ మరో 50,000ల టన్నులకు పైగా ఎక్కడి నుంచి తేవాలనేది కీలకప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ నిల్వలున్న కొత్త గనులను వేలంలో దక్కించుకోకపోతే మరో నాలుగైదేళ్లలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడుతుందని తెలంగాణ సర్కార్​కు సంస్థ తెలిపింది. దీనివల్ల టెండరు వేసి వేలంలో గనులను కొంటే ఉత్పత్తి పెంచగలమని ప్రభుత్వానికి వివరించింది. ఈ క్రమంలో కొత్త గనులను వేలంలో కొనడానికి సింగరేణి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విద్యుత్‌ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్ - రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రం!

పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.