ETV Bharat / state

రాష్ట్రంలో డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా చర్యలు ఉండాలి : సీఎం రేవంత్ - CM Revanth Visits Command Center

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 7:27 PM IST

Updated : May 25, 2024, 11:00 PM IST

CM Revanth Reddy at Police Command Control Center : బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు సీఎం రేవంత్​ రెడ్డి తొలిసారి వెళ్లారు. సీఎం హోదాలో వెళ్లడం ఇదే తొలిసారి. ఆయనకు సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం డ్రగ్స్​ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy at Police Command Control Center
CM Revanth Reddy at Police Command Control Center (ETV Bharat)

CM Revanth Reddy Visits Command Control Center : డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​కు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న సీఎంకు సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్​ సెక్యూరిటీ వింగ్​, డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్​ సెంటర్లను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత డ్రగ్స్​ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్​ బ్యూరో డైరెక్టర్​ సందీప్​ శాండిల్య హాజరయ్యారు. అలాగే జీహెచ్​ఎంసీ కమిషనర్​, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సమీక్షకు హాజరు అయ్యారు.

గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్ష : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్​గా పనిచేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్​ డ్రైవ్స్​ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్​ సరఫరా చైన్​ను బ్రేక్​ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్​ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్​ టీమ్స్​ను ఏర్పాటు చేయండని తెలిపారు. డ్రగ్స్​ నిర్మూలన కోసం ఎఫెక్టివ్​గా పని చేసేవారిని ప్రోత్సహించండని చెప్పారు. డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు.

వర్షాకాల వరదలపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష : హైదరాబాద్​ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్​గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అన్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. జూన్​ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.

పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు ఉండాలన్నారు. కోడ్​ ముగిసిన తరవాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పారు. నిర్లక్ష్యంగా వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పని చేసే వారిని ప్రోత్సహిస్తాం, అలాగే వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.

  • ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టండి. గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టండి.
  • వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి.
  • కంటోన్మెంట్​ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించండి.
  • సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్​ చేపట్టండి.
  • విద్యుత్​ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి. విద్యుత్​ అంతరాయం కలగకుండా చూడాలి. పవర్​ మేనేజ్​మెంట్​ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకొండి.

‘తెలంగాణపై’ నిఘా నేత్రం.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం

Command Control Center : 'కమాండ్‌ కంట్రోల్‌తో రాష్ట్రంలో భద్రత మరింత పటిష్ఠం'

Last Updated : May 25, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.