ETV Bharat / state

'నేనే డిప్రెషన్‌తో ఉన్నా, చచ్చిపోదామనుకుంటున్నా' - యూట్యూబర్ షణ్ముఖ్ వీడియో వైరల్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 1:28 PM IST

Bigg Boss Shanmukh Viral Video
Bigg Boss Shanmukh Viral Video

Bigg Boss Shanmukh Viral Video : బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్ సోదరుడు యువతిని మోసం చేసిన ఉదంతంలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు చేస్తున్న సమయంలో ఆమెతో షణ్ముఖ్ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో అతను నేనే డిప్రెషన్‌లో ఉన్నాను. చనిపోదాం అనుకుంటున్నాను అని మాట్లాడినట్లు కనిపించింది.

'నేనే డిప్రెషన్‌తో ఉన్నా, చచ్చిపోదామనుకుంటున్నా' - యూట్యూబర్ షణ్ముఖ్ వీడియో వైరల్

Bigg Boss Shanmukh Viral Video : బిగ్‌బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్ ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా తన సోదరుడు వినయ్ ఓ యువతిని మోసం చేసిన ఉదంతంలో షణ్ముఖ్ గంజాయితో పట్టుబడిన సంగతి తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోని పలు వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అతడు బాధితురాలితో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో షణ్ముఖ్, "నేనే డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. చచ్చిపోదాం అనుకుంటున్నాను" అని మాట్లాడటం గమనించొచ్చు.

Youtuber Shanmukh Ganjayi Case Update : ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షణ్ముఖ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో అతడి తప్పేం లేదని, అతడి సోదరుడు చేసిన తప్పునకు అనవసరంగా అతడిని నిందిస్తున్నారని షణ్ముఖ్ తరఫున అభిమానులు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇంకొందరు నెటిజన్లేమో అతడి తప్పేం లేకపోతే మెడికల్ టెస్టుల్లో తేలిపోతుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్

ఇదీ జరిగింది : రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో షణ్ముఖ్ జస్వంత్ (Youtuber Shanmukh Viral Video) అతడి సోదరుడు సంపత్ వినయ్‌తో కలిసి నివసిస్తున్నాడు. యూట్యూబర్‌ అయిన షణ్ముఖ్‌కు వైజాగ్‌కు చెందిన ఓ వైద్యురాలితో పరిచయం ఉంది. అతడు ఆమెను తన సోదరుడు వినయ్‌కు కూడా పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించి ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. కానీ యువతి తల్లి అనారోగ్యానికి గురి కావడంతో గతేడాది డిసెంబర్‌లో జరగాల్సిన వివాహం కాస్తా ఫిబ్రవి 24కు పోస్ట్‌పోన్ అయింది.

అయితే పెళ్లి పోస్ట్‌పోన్ అయినప్పటి నుంచి ఆమెను వినయ్ దూరం పెట్టడమే గాక ఇటీవల వేరే అమ్మాయితో పెళ్లికి కూడా ఓకే అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తనను మోసం చేశాడని సంపత్ వినయ్‌పై కేసు పెట్టి పోలీసులను తీసుకుని అతడి ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించగా 18 గ్రాముల గంజాయి (Shanmukh Ganjayi Case Update) లభించింది.

గంజాయిని సీజ్ చేసిన పోలీసులు వినయ్, షణ్ముఖ్‌లను అరెస్టు చేసి వేర్వేరు కేసులు నమోదు చేశారు. వినయ్‌ను రిమాండ్‌కు తరలించి, షణ్ముఖ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. అతడు గాంజా సేవించాడా లేదా అన్న విషయం నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన యూట్యూబ్​ స్టార్​ షణ్ముఖ్​..

Actress Nuveksha Latest Photos : తెల్లని టాప్​లో వయ్యారి భామ.. షణ్ముఖ్​తో రొమాన్స్​!.. ఎవరో గుర్తుపట్టారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.