ETV Bharat / state

గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 12:02 PM IST

Updated : Feb 24, 2024, 12:51 PM IST

Bigg Boss Fame Shanmukh
Bigg Boss Fame Shanmukh Caught with Ganja

Bigg Boss Fame Shanmukh Caught with Ganja : బిగ్​బాస్​ ఫేం, ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్​ గంజాయితో పట్టుబడ్డాడు. అతని సోదరుడు యువతిని ప్రేమించి మోసం చేసిన కేసులో దర్యాప్తులో భాగంగా జరిగిన సోదాల్లో షణ్ముఖ్​ను పోలీసులు అరెస్టు చేశారు.

Bigg Boss Fame Shanmukh Caught with Ganja : ప్రముఖ యూట్యూబర్​, బిగ్​బాస్​ ఫేం షణ్ముఖ్​ జశ్వంత్(Bigboss Fame Shanmukh)​ను గంజాయి కేసులో నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో అతని నివాసంలో పోలీసులు 18 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్​ సోదరుడు సంపత్​ వినయ్​ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా షణ్ముఖ్​ గంజాయితో పట్టుబడగా, అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్టణానికి చెందిన సంపత్​ వినయ్​ యూట్యూబ్​ వీడియోలు(Youtube Videos) చేస్తుంటాడు. ఈ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్​కు సోదరుడు. వీరిద్దరూ కలిసి నగర శివారు ప్రాంతం పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలైన యువతితో షణ్ముఖ్​కు పరిచయం ఉంది. ఈ పరిచయం ద్వారా 2015లో ఆమెకు సంపత్​ వినయ్​ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇంట్లో చెప్పగా, పెద్దలు నిశ్చితార్థం కూడా చేశారు. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామని భావిస్తే యువతి తల్లి అనారోగ్యం బారినపడడంతో వాయిదా పడింది. మళ్లీ ఈ ఫిబ్రవరి 24న పెళ్లి తేదీ నిర్ణయించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో షణ్ముఖ్​ సోదరుడు ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.

మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్

YouTuber Shanmukh Jaswanth : అయితే ఈ నెల 27న మరో యువతితో సంపత్​కు వివాహం చేస్తున్నామని అతడి తల్లిదండ్రులు యువతికి చెప్పారు. వెంటనే తాను మోసపోయానని గుర్తించిన యువతి, గురువారం నార్సింగి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని అతని ఇంటివద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా షణ్ముఖ్​ జశ్వంత్​ 18 గ్రాముల గంజాయితో పట్టుబడ్డాడు.

వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా వేర్వేరు కేసులు నమోదు చేయగా, సంపత్​ను రిమాండ్​కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. షణ్ముఖ్​ను వైద్య పరీక్షల నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. అతడు గంజాయి సేవించాడా లేదా అని నిర్ధారించుకునేందుకు సిక్స్​ ప్యానెల్​ టెస్ట్​ చేయాలని పోలీసులు వైద్యాధికారులకు సూచించారు. ఆ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

"షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ అమ్మాయిని మోసం చేశాడు.పెళ్లి ఒప్పందాన్ని ఉల్లంఘించి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని అమ్మాయి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్న క్రమంలో నిందితుడు సంపత్ వినయ్​ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతని దగ్గర గంజాయి దొరికింది. దీనిపై విచారణ చేపట్టిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం." -జీవీ రమణ గౌడ్, ఏసీపీ నార్సింగి

గంజాయితో పట్టుబడ్డ బిగ్​బాస్​ ఫేం షణ్ముఖ్​ సోదరుడు- అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్‌ ఆర్టిస్టుపై లైంగిక వేధింపులు.. ఆ సినిమా హీరో అరెస్ట్

Tollywood Drugs Case: నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్‌ను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ

Last Updated :Feb 24, 2024, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.