ETV Bharat / state

అమ్మ బాబోయ్!! కిడ్నీలో ఏకంగా 418 రాళ్లు - రెండు గంటలు శ్రమపడి తొలగించిన డాక్టర్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 11:59 AM IST

418 Kidney Stones Removed in a Patient : హైదరాబాదీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఓ రోగి కిడ్నీలో నుంచి 418 వరకు రాళ్లను తొలగించారు. ఈ శస్త్రచికిత్సకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు.

418 Kidney Stones Removed
418 Kidney Stones Removed

418 Kidney Stones Removed in a Patient : ఓ వ్యక్తి కిడ్నీ నుంచి ఏకంగా 418 వరకు రాళ్లను వైద్యులు బయటకు తీశారు. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీ దెబ్బతినడంతో తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ ఆసుపత్రిలో (ఏఐఎన్‌యూ) చేరాడు. వివిధ పరీక్షల తర్వాత అతని మూత్రపిండాల్లో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సర్జరీ చేయాలని వైద్యులు డాక్టర్‌ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్‌ గోపాల్‌, డాక్టర్‌ దినేష్‌ బృందం నిర్ణయం తీసుకుంది.

418 Kidney Stones Removed in Hyderabad : ఈ క్రమంలోనే పెర్క్యుటేనియస్‌ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్‌) విధానంలో మినిమల్లీ ఇన్వేజివ్‌ పద్ధతిలో ఎలాంటి కోత లేకుండా అతనికి ఆపరేషన్‌ చేశారు. చిన్న చిన్న రంధ్రాలతో లోపలకు సూక్ష్మ కెమెరాను, లేజర్‌ ప్రోబ్‌లను పంపి రాళ్లను బయటకు తీశారు. దాదాపు 418 రాళ్లను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం అతడి కిడ్నీ (Kidney Stones) పనితీరు మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వైద్యులు వివరించారు.

ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​!

How to Prevent Kidney Stones : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, నారింజ పండ్లను తినాలని అంటున్నారు. అలాగే ద్రాక్ష, బొప్పాయి వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలని వివరిస్తున్నారు. పాలకూర, బీట్‌రూట్‌ వంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.

Kidney Stones Diet : కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? వీటిని తినడం తగ్గించుకోండి.. లేదంటే!

ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రంలో కాల్షియం స్థాయి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే హైబీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఉప్పును తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విటమిన్​-డీ ఉండే ఆహార పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా దొరుకుతుందని, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలతో పాటు కిడ్నీ ఆరోగ్యం (Kidney Health)కూడా మెరుగుపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ కిడ్నీలు సేఫ్​

యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు.. ఇవి తింటే అంతా సెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.