ETV Bharat / sports

యశస్వి 'డబుల్' ధమాకా- మూడో బ్యాటర్​గా రికార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:37 AM IST

Updated : Feb 3, 2024, 11:09 AM IST

Yashasvi Jaiswal Double Century: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో యశస్వి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఓవర్​నైట్ స్కోర్ 179తో రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ వరుసగా సిక్స్, ఫోర్ బాది 200 మార్క్ అందుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్​లో టీమ్ండియా 396 పరుగులకు ఆలౌటైంది.

Yashasvi Jaiswal Double Century
Yashasvi Jaiswal Double Century

Yashasvi Jaiswal Double Century: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ కెరీర్​లో తొలి డబుల్ సెంచరీ (209) సాధించాడు. ఇంగ్లాండ్​తో విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న టెస్టులో ఓవర్​నైట్ స్కోర్ 179తో రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ 200 మార్క్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో ద్విశతకం సాధించిన టీమ్ఇండియా ప్లేయర్లలో మూడో అతిపిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డు కొట్టాడు. అలాగే కెరీర్​లో ఆడుతున్న 10వ ఇన్నింగ్స్​లోనే జైశ్వాల్ ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక అండర్సన్​ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన జైశ్వాల్ క్యాచౌట్​గా వెనుదిరిగాడు.

భారత్​ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆతిపిన్న వయస్కులు

  • వినోద్ కాంబ్లీ (224)- 21 ఏళ్ల 35 రోజులు- 1993
  • వినోద్ కాంబ్లీ (227)- 21 ఏళ్ల 55 రోజులు- 1993
  • సునిల్ గావస్కర్ (201*)- 21 ఏళ్ల 283 రోజులు- 1971
  • యశస్వి జైశ్వాల్ (209)- 22 ఏళ్ల 37 రోజులు- 2024

టీమ్ఇండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్​లో 200 అందుకున్న బ్యాటర్లు

  • కరున్ నాయర్- 3 ఇన్నింగ్స్​లు
  • వినోద్ కాంబ్లీ- 4 ఇన్నింగ్స్​లు
  • సునిల్ గావస్కర్- 8 ఇన్నింగ్స్​లు
  • మయంక్ అగర్వాల్- 8 ఇన్నింగ్స్​లు
  • ఛెతేశ్వర్ పుజారా- 9 ఇన్నింగ్స్​లు
  • యశస్వి జైశ్వాల్- 10 ఇన్నింగ్స్​లు

336-6తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 60 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 396 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (20), జస్ర్పీత్ బుమ్రా (5), ముకేశ్ కుమార్ (0) పెవిలియన్ చేరారు. కుల్​దీప్ యాదవ్ (8) నాటౌట్​గా నిలిచాడు. ఇక టీమ్ఇండియా 396లో యశస్వి ఒక్కడే 209 పరుగులు చేయడం విశేషం. మిగిలిన 10మంది ప్లేయర్లు 187 పరుగులు చేశారు. కాగా, తొలి రోజు ఒక వికెట్ దక్కించుకున్న జేమ్స్ అండర్సన్ రెండో రోజు 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో అతడి వికెట్ల సంఖ్య 693కు చేరింది. షోయబ్ బషీర్ 3, రెహాన్ అహ్మద్ 3, టామ్ హార్ట్లీ 1 వికెట్ పడగొట్టారు.

'మ్యాచ్​కు రూ.200-300 వచ్చేవి- బ్యాట్ కూడా ఉండేది కాదు' యశస్వి ఎమోషనల్ వీడియో

అండర్సన్ అరుదైన ఘనత- 72 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Last Updated : Feb 3, 2024, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.